Manchu Vishnu: దుబాయ్‌పై క్షిపణి దాడులు... వీడియో పంచుకున్న మంచు విష్ణు
- కుటుంబాన్ని కలిసేందుకు దుబాయ్ వెళ్లిన మంచు విష్ణు
- ఆకాశంలో క్షిపణులు చూసి భయాందోళన
- భారీ శబ్దాలకు ఇల్లు దద్దరిల్లిందన్న నటుడు
- చిన్నారి ఐరా భయపడిందంటూ ఆవేదన
- యూఏఈ రక్షణ దళాలకు ప్రత్యేక కృతజ్ఞతలు
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణుకు దుబాయ్‌లో భయానక అనుభవం ఎదురైంది. ప్రస్తుతం తన కుటుంబాన్ని కలిసేందుకు దుబాయ్ వెళ్లిన ఆయన, అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం చూసి ఆందోళనకు గురయ్యారు. ఆకాశంలో క్షిపణులు వెళుతుండటం, వాటిని అడ్డుకుంటున్న దృశ్యాలు తన కంటపడ్డాయని విష్ణు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ముఖ్యంగా క్షిపణులను అడ్డుకుంటున్న సమయంలో వచ్చిన భారీ శబ్దాలకు తాము బస చేసిన ఇల్లు దద్దరిల్లిపోయిందని విష్ణు పేర్కొన్నారు. ఈ శబ్దాలకు తన చిన్న కూతురు ఐరా తీవ్రంగా భయపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ చిన్నారి కూడా ఇలాంటి యుద్ధ వాతావరణంలో, బాంబుల శబ్దాల మధ్య పెరగకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు.
అయితే, పౌరుల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న యూఏఈ రక్షణ దళాలకు మంచు విష్ణు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి వల్లే తాము క్షేమంగా ఉన్నామని చెప్పారు. జీవితం ఎంత చిన్నదో, ఎంత సున్నితమైనదో ఇలాంటి ఘటనలు గుర్తుచేస్తాయని ఎమోషనల్ అయ్యారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చివరగా 'హర హర మహాదేవ్' అంటూ తన సందేశాన్ని ముగించారు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు చేస్తుండడం తెలిసిందే. దాంతో ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. అమెరికా మిత్రదేశాలపై క్షిపణులను ప్రయోగించినట్టు తెలుస్తోంది.