మావోయిస్టు నేతల లొంగుబాటుపై అసెంబ్లీలో ప్రకటన చేస్తా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- చట్టపరిధిలో వారు ఏమైనా చేసుకోవచ్చన్న ముఖ్యమంత్రి
- చట్టాలను ఉల్లంఘిస్తే మాత్రం ప్రభుత్వం తన పని తాను చేస్తుందని వ్యాఖ్య
- ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీ పట్టుకుంటే నడవదని మాజీ మావోయిస్టు కీలక వ్యాఖ్య
మావోయిస్టు కీలక నేతల లొంగుబాటుపై అసెంబ్లీలో ప్రకటన చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మావోయిస్టు మాజీ అగ్ర నాయకులు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్నలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సచివాలయంలో సమావేశమైన విషయం తెలిసిందే.
భేటీ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్టపరిధిలో వారు ఏమైనా చేసుకోవచ్చని తెలిపారు. చట్టాలను ఉల్లంఘిస్తే మాత్రం ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
తుపాకీ పట్టుకుంటే నడవదు: దేవ్‌జీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం మాజీ మావోయిస్టు దేవ్‌జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రివార్డు పాలసీని కోటి రూపాయలకు పెంచాలని ఆయన కోరారు. తమకు ఐదెకరాల భూమి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. భూమి సాధ్యం కాదని ముఖ్యమంత్రి చెప్పారని, కానీ ఇల్లు, ఉద్యోగం, జీవనభృతిపై హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే జైళ్లలో ఉన్న మావోయిస్టులను కలిసి, ఆ తర్వాత లొంగుబాట్లపై అందరం కలిసి ప్రజలకు బహిరంగ లేఖ రాస్తామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీ సిద్ధాంతం నడవదని ప్రజలకు వివరిస్తామని అన్నారు.