40 దేశాల నుంచి కోళ్లు, కోడిగుడ్లపై నిషేధం విధించిన సౌదీ అరేబియా.. జాబితాలో భారత్‌, చైనా

25-02-2026 Wed 16:30 | International
Advertisement
  • బర్డ్ ఫ్లూ తదితర కారణాలతో నిషేధం విధించిన సౌదీ
  • అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలపై పాక్షిక నిషేధం
  • అంతర్జాతీయ పరిస్థితులను సమీక్షిస్తూ జాబితాను సవరిస్తామని వెల్లడి
Advertisement

ప్రజారోగ్యం, ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 దేశాల నుండి కోళ్లు (పౌల్ట్రీ), గుడ్ల దిగుమతిపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) సంపూర్ణ నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయంగా వ్యాపిస్తున్న వివిధ రకాల అంటువ్యాధులు, ముఖ్యంగా ప్రమాదకరమైన బర్డ్ ఫ్లూ తదితర వైరస్ ల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.


సౌదీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ తాజా జాబితాలో భారత్‌తో పాటు చైనా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 16 దేశాల్లోని నిర్దిష్ట ప్రాంతాలపై పాక్షిక ఆంక్షలు విధించింది. వీటిలో అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ దేశాల జాబితాను సవరిస్తామని అధికారులు వెల్లడించారు.


అయితే, ఈ నిషేధం కేవలం పచ్చి మాంసం, గుడ్లకు మాత్రమే వర్తిస్తుందని సౌదీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తగిన ఉష్ణోగ్రత వద్ద ఉడికించిన (Heat-treated) పౌల్ట్రీ ఉత్పత్తులకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఇచ్చారు. వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేని విధంగా ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు, ధృవీకరించబడిన సంస్థల నుండి వస్తే అనుమతిస్తామని పేర్కొన్నారు.

Advertisement
Saudi ArabiaPoultry banSaudi Food and Drug AuthoritySFDABird FluIndiaChinaEgg importsFood safetyPublic health

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more