Chandrababu Naidu: ఆ రోజు ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే నేను కల్తీ నెయ్యిపై మాట్లాడాను: సీఎం చంద్రబాబు
- రూ.234 కోట్లతో 59 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ఆరోపణ
- కల్తీ అని తేలిన నివేదికను నాటి ఛైర్మన్ తొక్కిపెట్టారని సీఎం వెల్లడి
- నాటి టీటీడీ ఛైర్మన్ పీఏ రూ.4.5 కోట్ల లంచం తీసుకున్నారని ఆరోపణ
- గత ఐదేళ్లలో 2032 ఆలయాలపై దాడులు జరిగాయన్న చంద్రబాబు
తాను ఎన్డీయే సమావేశంలో టీటీడీ కల్తీ నెయ్యి గురించి మాట్లాడింది జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) ఇచ్చిన నివేదిక ఆధారంగానేనని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో 'కల్తీ నెయ్యి' వ్యవహారంపై జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) జరిగిన అక్రమాలను, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు కూలంకషంగా వివరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "ఎవరికి ఏ కష్టం వచ్చినా వేంకటేశ్వరస్వామిని మొక్కుకుంటాం. అలాంటిది 2019-24 మధ్య స్వామివారికి జరిగిన అపచారం పట్ల ఎంతో ఆవేదన చెందాం. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని పోరాడితే మాపైనే కేసులు పెట్టి వేధించారు. అందులో నేనూ బాధితుడినే. రామతీర్థంలో రాముడి తల నరికితే అక్కడికి వెళ్లినందుకు నాపై కేసు పెట్టారు" అని గుర్తుచేశారు. తనపై 23 క్లేమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు శ్రీవారే తనను కాపాడారని, ఆయన సేవలో ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని తాను బలంగా నమ్ముతానని ఉద్వేగంగా ప్రసంగించారు.
సిండికేట్‌గా ఏర్పడి కుట్ర
గత ప్రభుత్వ పెద్దల అండతో ఒక సిండికేట్‌గా ఏర్పడి ఈ కల్తీ నెయ్యి కుట్రకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. "టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చి, నాణ్యతా ప్రమాణాలను తగ్గించారు. 2022 మే నెలలోనే భోలేబాబా సంస్థ నెయ్యి నాణ్యతపై ఫిర్యాదు అందింది. ఆగస్టులో సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్ రిపోర్టులో ‘బీటా సిటోస్టెరాల్’తో నెయ్యి కల్తీ జరిగిందని స్పష్టంగా తేలినా, నాటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆ నివేదికను తొక్కిపెట్టారు. ఒకవేళ ఆరోజే చర్యలు తీసుకుని ఉంటే ఇంత అపచారం జరిగేది కాదు" అని విమర్శించారు. ఈ కల్తీ నెయ్యితో సుమారు 20.01 కోట్ల లడ్డూలను తయారుచేసి భక్తులకు విక్రయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కుంభకోణంలో భాగంగా నాటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న ఏకంగా రూ.4.5 కోట్ల లంచం తీసుకున్నారని, నకిలీ సర్టిఫికెట్లతో టెండర్లు దక్కించుకుని ఏఆర్ డైరీ నుంచి ఈ కల్తీ నెయ్యి సరఫరా చేశారని చంద్రబాబు ఆరోపించారు. "టీటీడీలోని సాంకేతిక నిపుణులకు ఖరీదైన ఫోన్లు ఎరవేసి కల్తీకి గేట్లు తెరిచారు. సిట్ దర్యాప్తులో లంచాల వివరాలతో కూడిన డైరీ, మోనో గ్లిసరైట్, ఎసిటిక్ యాసిడ్ లాంటి రసాయనాల డ్రమ్ములు బయటపడ్డాయి," అని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై సిట్ వేయాలని భావిస్తే, వైసీపీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లి దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించిందని గుర్తుచేశారు.
హిందూమతంపై ప్రణాళికాబద్ధ దాడి
గత ఐదేళ్ల పాలనలో కేవలం నెయ్యి కుంభకోణమే కాదని, హిందూమతంపై, దేవాలయాలపై ప్రణాళికాబద్ధంగా దాడి జరిగిందని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్లపై జెరుసలేం యాత్ర అంటూ అన్యమత ప్రచారం చేశారు. అసలు లేని పింక్ డైమండ్ చోరీ అయిందని నాపై దుష్ప్రచారం చేసి శ్రీవారి ప్రతిష్ఠను దిగజార్చారు. టీటీడీ బోర్డును 85 మంది సభ్యులతో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. పరకామణిలో చోరీ జరిగితే దాన్ని సెటిల్ చేసేందుకు ప్రయత్నించి, దేవుడి హుండీ వ్యవహారాన్ని చులకన చేశారు. తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం చేయకుండా దౌర్జన్యంగా వ్యవహరించారు" అని గత ఘటనలను ఏకరువు పెట్టారు.
2019-24 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 2032 దేవాలయాలపై దాడులు జరిగాయని, రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదం, అంతర్వేది, బిట్రగుంట రథాల దగ్ధం, దుర్గగుడి వెండి సింహాల చోరీ వంటి ఘటనల్లో ఒక్కరిపైనా సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై దాడులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, దోషులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ ఈవోను నియమించి ప్రక్షాళన చర్యలు చేపట్టామని, ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే తాను కల్తీ జరిగిందని చెప్పానని స్పష్టం చేశారు.