Shikhar Dhawan: గతాన్ని గౌరవిస్తా.. తప్పుడు ప్రచారం ఆపండి: శిఖర్ ధావన్
- తన స్నేహితురాలు సోఫీ షైన్‌ను రెండో వివాహం చేసుకున్న గబ్బర్
- తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్‌పై ఆగ్రహం
- తన పేరుతో క్లిక్‌బైట్ వార్తలు సృష్టించవద్దని విజ్ఞప్తి
- మొదటి భార్యతో విడాకుల తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన ధావన్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈ సంతోషకరమైన సమయంలోనే సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించాడు. తన రెండో వివాహం జరిగిన వెంటనే, వ్యక్తిగత జీవితానికి సంబంధించి తనకు ఆపాదిస్తూ వైరల్ అవుతున్న తప్పుడు కోట్స్‌ను ఖండిస్తూ ఘాటుగా సమాధానమిచ్చాడు.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ధావన్ తన స్నేహితురాలు సోఫీ షైన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కొన్ని ట్రోల్ ఖాతాలు ఆయనపై కల్పిత కథనాలతో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ప్రారంభించాయి. దీనిపై గబ్బర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించాడు. "నా వ్యక్తిగత జీవితం గురించి కొన్ని నిరాశాజనకమైన వ్యాఖ్యలను నాకు ఆపాదిస్తూ వస్తున్న పోస్టులు నా దృష్టికి వచ్చాయి. నేను గతాన్ని ఎప్పుడూ మోయను. అది మైదానంలో అయినా, బయట అయినా సరే. గతాన్ని గౌరవిస్తూనే, సానుకూల దృక్పథాన్ని బలంగా నమ్ముతాను" అని పేర్కొన్నాడు.
"ఇది నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం. అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి నాకు లభించిన ప్రేమకు కృతజ్ఞతలు. దయచేసి క్లిక్‌బైట్ కోసం సున్నితత్వం లేకుండా నా పేరుతో తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దు. ప్రేమను, సానుకూలతను పంచుదాం" అని ఆయన విజ్ఞప్తి చేశాడు.
కలుసుకోలేకపోతున్నానని ధావన్ పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినా, ఎన్నడూ తన మాజీ భార్య గురించి చెడుగా మాట్లాడలేదు. అయినప్పటికీ ఆయన చెప్పినట్లుగా కొన్ని కల్పిత పోస్టులు వైరల్ అయ్యాయి. 2023 అక్టోబర్ లో ఐషా ముఖర్జీ నుంచి ధావన్ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాడు. కుమారుడి కస్టడీ కోసం ఆయన తీవ్రమైన న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. ఆ గతాన్ని ముగించుకుని 2025 మధ్యలో సోఫీ షైన్‌తో తన సంబంధాన్ని బయటపెట్టిన ధావన్, ఇప్పుడు వివాహంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు.