Nara Lokesh: పొందూరు ఖాదీతో నారా లోకేశ్ కు శ్రీకాకుళం నేతల సరదా కౌంటర్
- ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు
- రాజకీయాలకు దూరంగా నవ్వులు పూయించిన ఆత్మీయ సమావేశం
- నేతల వినతులపై నివేదికలు అందించి, కుటుంబసభ్యులకు చీరల బహూకరణ
- టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కుటుంబసమేతంగా హాజరు
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన ఆత్మీయ విందు, రాజకీయాలకు అతీతంగా నవ్వుల విందుగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యుల కోసం సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో లోకేశ్ ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రోజూవారీ రాజకీయ హడావుడికి దూరంగా, పూర్తి వ్యక్తిగత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ సమావేశంలో నేతలంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, తమ కుటుంబసభ్యులను పరస్పరం పరిచయం చేసుకున్నారు. రాజకీయ అంశాలకు తావులేకుండా ప్రేమలు, పెళ్లిళ్లు, పిల్లల బాగోగులు, ప్రాంతీయ ప్రత్యేకతల వంటి ఆసక్తికరమైన విషయాలపై ముచ్చటించుకున్నారు. శ్రీకాకుళం నేతల వెటకారం, విజయనగరం నాయకుల చతురతతో సంభాషణలు రక్తి కట్టించాయి. సమావేశం ముగిసేంత వరకు ఒక్కరి ఫోన్ కూడా మోగకపోవడం, ఎవరూ మధ్యలో లేచి వెళ్లకపోవడం అక్కడి ఆత్మీయ వాతావరణానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ సందర్భంగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. మంత్రి లోకేశ్ తన నియోజకవర్గమైన మంగళగిరి చేనేత వస్త్రాల ప్రత్యేకతను ప్రమోట్ చేయగా, శ్రీకాకుళం ప్రజాప్రతినిధులు తమదైన శైలిలో స్పందించారు. మహాత్మాగాంధీ మెచ్చిన ప్రఖ్యాత పొందూరు ఖాదీ పంచెలను వారు లోకేశ్ కు బహూకరించి సరదాగా కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు గతంలో తనకు ఇచ్చిన వినతులపై తాజా పురోగతి నివేదికలను లోకేశ్ వారికి అందించారు. అనంతరం నేతల కుటుంబసభ్యులకు మంగళగిరి పట్టుచీరలను బహుమతిగా అందజేశారు.
ఈ ఆత్మీయ విందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కుటుంబసమేతంగా హాజరయ్యారు. వీరిలో కూన రవికుమార్, గౌతు శిరీష, కళా వెంకటరావు, కోండ్రు మురళీ మోహన్ వంటి సీనియర్ నేతలతో పాటు జనసేనకు చెందిన లోకం మాధవి, బీజేపీకి చెందిన నడికుదిటి ఈశ్వరరావు కూడా ఉన్నారు.