Bangladesh Hindu Attacks: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని ఆకృత్యాలు.. మహిళపై సామూహిక అత్యాచారం

Bangladesh Hindu Woman Gang Raped in Chandpur
  • ప్రభుత్వం మారినా ఆగని దాడులు, ఆకృత్యాలు
  • దివ్యాంగురాలైన మహిళను ఎత్తుకెళ్లి అత్యాచారం
  • నిందితులను అరెస్టు చేయకపోవడంపై హిందూ సంఘాల ఆగ్రహం
బంగ్లాదేశ్‌లోని చాంద్‌పూర్ జిల్లాలో హిందూ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతోన్న దాడులు, ఆకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత కూడా దాడులు ఆగడం లేదు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలైన మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు.

స్పృహ కోల్పోయిన మహిళను నిందితులు అక్కడే వదిలి వెళ్లిపోయారు. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఆ మహిళను గుర్తించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తనపై రకీబ్, సోహైల్, రస్సెల్ అనే ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వారు తనను తీవ్రంగా హింసించి గాయపరిచినట్లు తెలిపింది. అయితే పోలీసులు వారిని అరెస్టు చేయలేదు. దీంతో స్థానికులు, హిందూ సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Bangladesh Hindu Attacks
Hindu Woman Raped
Bangladesh Violence
Chandpur District
Rakeeb

More Telugu News