కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్... కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ!

Manjit Sangha loses limbs after dog lick infection
బ్రిటన్‌లో నివసిస్తున్న భారత సంతతి మహిళ జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క.. మహిళ గాయాన్ని నాకడంతో ఆమె సెప్సిస్ బారిన పడి, రెండు చేతులు, రెండు కాళ్లు కోల్పోవాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన పెంపుడు జంతువుల యజమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళితే, యూకేలోని వుల్వర్‌హాంప్‌టన్‌కు చెందిన మంజిత్ సంఘా (52) అనే మహిళ గత ఏడాది జూలైలో అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన ఆమెకు అనారోగ్యంగా అనిపించగా, మరుసటి రోజు ఉదయానికి స్పృహ కోల్పోయారు. ఆమె చేతులు, కాళ్లు చల్లగా మారడం, పెదవులు నీలంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త కమల్‌జిత్ సంఘా బీబీసీకి వివరిస్తూ, "ఒక్క రోజులో అంతా మారిపోయింది. శనివారం కుక్కతో ఆడుకుంది, ఆదివారం పనికి వెళ్లింది, సోమవారానికి కోమాలోకి వెళ్లిపోయింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూ క్రాస్ ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చిన వైద్యులు, ఆమె సెప్సిస్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. కుక్కల లాలాజలంలో సహజంగా ఉండే 'క్యాప్‌నోసైటోఫాగా కానిమోర్సస్' అనే బ్యాక్టీరియా, ఆమె శరీరంలోని చిన్న గాయం ద్వారా రక్తంలోకి ప్రవేశించిందని గుర్తించారు. ఈ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆమెకు ఆరుసార్లు గుండెపోటు వచ్చింది. ప్రాణాలు కాపాడే క్రమంలో వైద్యులు ఆమె రెండు కాళ్లు (మోకాళ్ల కింద), రెండు చేతులు తొలగించారు. ఆమె ప్లీహాన్ని కూడా తీసేయాల్సి వచ్చింది.

సుమారు 32 వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన మంజిత్, ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు. పెంపుడు జంతువులతో ఆడుకునేటప్పుడు, వాటి లాలాజలం గాయాలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
Go Back to Shorts
Manjit Sangha
sepsis
dog saliva
Capnocytophaga canimorsus
infection
amputation
UK
Wolwerhampton
pet health

More Telugu News