థాంక్యూ ఫిల్మ్‌ఫేర్... బెస్ట్ యాక్టర్ అవార్డుపై అల్లు అర్జున్ స్పందన

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో 'పుష్ప 2: ది రూల్' చిత్రానికి గాను ఉత్తమ నటుడి (తెలుగు) అవార్డును గెలుచుకున్నారు. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డుల ప్రదానోత్సవం కేరళలోని కొచ్చి నగరంలో అట్టహాసంగా జరిగింది.  ఈ వేడుకకు దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు.

ఈ పురస్కారం అందుకోవడంపై అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. "ఈ అద్భుతమైన గౌరవాన్ని అందించిన ఫిల్మ్‌ఫేర్‌కు ధన్యవాదాలు. నన్ను ప్రత్యేకంగా అభిమానించే ఈ గడ్డపై అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరి ఆశీర్వాదాలకు నేను వినమ్రతతో ఉన్నాను. నాపై అనంతమైన ప్రేమను కురిపిస్తున్న నా అభిమానులందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను" అని పేర్కొన్నారు.

అల్లు అర్జున్‌కు ఇది ఏడో ఫిల్మ్‌ఫేర్ అవార్డు కావడం విశేషం. దీంతో అత్యధిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న నటుడిగా మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన రికార్డును అల్లు అర్జున్ సమం చేశారు.

Allu Arjun
Pushpa 2 The Rule
Filmfare Awards
Best Actor Telugu
Chiranjeevi
South Indian Cinema
Tollywood
Kerala Kochi

More Telugu News