Ananta Babu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య కోసం గాలిస్తున్న పోలీసులు
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు
- హత్య జరిగినప్పుడు అనంతబాబుతో పాటు లక్ష్మీ దుర్గ కారులోనే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు
- ప్రస్తుతం పరారీలో ఉన్న లక్ష్మీ దుర్గ
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసు ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. 2022 మే 19న ఈ ఘటన జరిగింది. ఈ కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. తాజాగా, ఈ హత్యలో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ ప్రమేయం కూడా ఉన్నట్టు సిట్ అధికారులు నిర్ధారించారు. ఆమెను ఈ కేసులో ఏ-2గా పేర్కొంటూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో అడిషనల్ చార్జ్ షీట్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో లక్ష్మీ దుర్గ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాకినాడ, అడ్డతీగలలో ఆమె లేదని, ఆమె పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు, హత్య జరిగినప్పుడు తాను తమ బంధువులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లానని గతంలో ఆమె వాంగ్మూలం ఇచ్చారు. అయితే, ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందని... హత్య జరిగిన రాత్రి అనంతబాబుతో పాటు ఆమె కారులోనే ఉందని సీసీ కెమెరా విజువల్స్ ద్వారా సిట్ టీమ్ గుర్తించింది. ఆ నేపథ్యంలో, ఆమెను ఏ-2గా పోలీసులు చేర్చారు.