Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత

Jeevan Reddy Suffers Minor Illness Admitted to NIMS
షార్ట్స్‌లో చూడండి
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వాంతులు, విరేచనాల కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయనకు ఫుడ్ పాయిజన్ అయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

కాగా, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల అంశంలో జీవన్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగిత్యాలలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సంజయ్ కుమార్ కాంగ్రెస్‌తో కలిసి ఉండటాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జగిత్యాల మున్సిపాలిటీలో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తన వర్గానికి 20 టిక్కెట్లు ఇచ్చి, సంజయ్ కుమార్ వర్గానికి 30 టిక్కెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఫలితాలు వెలువడిన తర్వాత సంజయ్ కుమార్ వర్గానికి ఛైర్మన్ పదవిని ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
Go Back to Shorts
Jeevan Reddy
Congress leader
NIMS Hospital
Food Poisoning
Jagityala Municipality Elections

More Telugu News