Imran Khan: నార్సింగిలో ఘోరం: ఎనిమిదో తరగతి బాలికపై గ్యాంగ్ రేప్

Hyderabad minor girl gang rape Imran Khan main accused
  • చార్మినార్ దగ్గర పరిచయమైన నిందితుడు
  • మాయమాటలతో చెంగిచెర్లకు కిడ్నాప్
  • గంజాయి, మద్యం తాగించి రాక్షసత్వం
  • పాత నేరస్థుడితో పాటు ఇద్దరు బాలుర ఘాతుకం
భాగ్యనగర శివార్లలో నాగరికత తలవంచుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. చదువుకోవాల్సిన వయసులో మాయమాటలకు లోనైన ఓ ఎనిమిదో తరగతి బాలికను కామాంధులు చిదిమేశారు. నమ్మించి తీసుకెళ్లి, బలవంతంగా గంజాయి, మద్యం తాగించి ముగ్గురు మృగాళ్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

పుప్పాలగూడకు చెందిన 15 ఏళ్ల బాలిక, చార్మినార్ వద్ద షాపింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ చెప్పుల వ్యాపారం చేసే ఓ బాలుడితో పరిచయమైంది. ఆ పరిచయంతో ఫోన్ నంబర్ తీసుకున్న సదరు బాలుడు, ఈ నెల 16న ఆమెను కలవాలని మాయమాటలు చెప్పి పిలిపించాడు. స్కూలుకు వెళ్తున్నానని నమ్మించిన బాలిక అతడి వద్దకు వెళ్లింది

బాలికను ఆటోలో ఎక్కించుకున్న నిందితుడు.. పాతబస్తీకి చెందిన పాత నేరస్థుడు ఇమ్రాన్ ఖాన్ అలియాస్ షిషితో పాటు మరో బాలుడిని పిలిపించాడు. అందరూ కలిసి ఆమెను చెంగిచెర్లలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలికకు బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం కత్తితో బెదిరించి ముగ్గురూ  అఘాయిత్యానికి ఒడిగట్టారు.

బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలతో చెంగిచెర్లలో బాలికను రక్షించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు, రౌడీషీటర్ ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఒక బాలుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో బాలుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది, ఆమె ప్రైవేట్ భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితులపై పోక్సో (POCSO) చట్టం కింద కఠిన కేసులు నమోదు చేశారు.
Imran Khan
Hyderabad crime
Narsingi police
minor girl rape
gang rape case
Telangana news
crime news
POCSO act
sexual assault
crime investigation

More Telugu News