అభిమానులు గర్వపడే సినిమా ఇది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్‌లో సమంత

Samantha Confident About Ma Inti Bangaram Movie Success
  • సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’
  • నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
  • జూన్ 19న సినిమా విడుదల.. తాజాగా ట్రైలర్ లాంచ్
  • ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పిన సమంత
  • సినిమా బ్లాస్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేసిన నందినీ రెడ్డి
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మాతగానూ వ్యవహరిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను జూన్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ, ఈ సినిమా అభిమానులు గర్వపడేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ.. “‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా కోసం వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు. దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాత రాజ్ నిడిమోరు ప్రతీ విషయంలో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. వారితో నాకు ఇప్పటివరకు ఎలాంటి భేదాభిప్రాయాలు రాలేదు. ఈ సినిమాలో యాక్షన్, డ్రామా, కామెడీతో పాటు అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తుంది. జూన్ 19న అందరూ సినిమా చూసి ఆనందించండి” అని అన్నారు.

దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ.. “సమంత నటిగా ఎంతో ఎదిగారు. ఒకప్పటి సమంతకు, ఇప్పటి సమంతకు చాలా తేడా ఉంది. ఆమె నటన ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. యాక్షన్, కామెడీ, ఎమోషన్.. ఇలా ప్రతీ సన్నివేశంలో అదరగొట్టేశారు. నేను కూడా ఒక అభిమానిలాగే మానిటర్ ముందు కూర్చుని ఆమె నటనను ఆస్వాదించాను. ఈ సినిమా కచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది. అందరినీ ఆకట్టుకుంటుంది” అని తెలిపారు.

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంతతో పాటు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. “‘మా ఇంటి బంగారం’ అనే పేరులో ప్రేమ, ఆప్యాయత కనిపిస్తాయి. కానీ దాని వెనుక ఒక డార్క్ సైడ్, పొసెసివ్‌నెస్ కూడా ఉంది. సమంత, నందినీ రెడ్డి మధ్య ఉన్న బాండింగ్ వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది” అని వివరించారు. మరో నిర్మాత హిమాంక్ దువ్వూరు మాట్లాడుతూ, నటిగా, నిర్మాతగా సమంత వందకు వంద మార్కులు సంపాదించుకున్నారని ప్రశంసించారు.

ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన శ్రీముఖి మాట్లాడుతూ.. “సమంత హీరోయిన్ అనగానే కథ వినకుండానే ఓకే చెప్పాను. ఆమె నిజంగానే బంగారం. ఈ చిత్రంలో ఆమె నవ్విస్తారు, ఏడిపిస్తారు, ఫైట్స్ కూడా చేస్తారు” అని అన్నారు. నటుడు శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ.. "జూన్ 19న థియేటర్లలో ప్రేక్షకులు గన్ పవర్, గాజుల పవర్ రెండూ చూస్తారు" అని వ్యాఖ్యానించారు.

ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, మంజూష తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

Go Back to Shorts
Samantha
Ma Inti Bangaram
Samantha Movie
Nandini Reddy
Raj Nidimoru
Family Entertainer
Telugu Movie
Sree Mukhi
Action Drama Comedy

More Telugu News