Dil Raju: ప్రస్తుతం నిర్మాతల పరిస్థితిపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

No Value for Producer Nowadays Says Dil Raju
  • నిర్మాత అంటే 'ఇచ్చేవాడు' అన్న దిల్ రాజు
  • ఇచ్చిన వారిని శాసించే స్థాయిలో ఇప్పుడు పరిశ్రమ ఉందని వ్యాఖ్య
  • అట్లూరి సమర్పణలో విలువలతో కూడిన చిత్రాన్ని నిర్మిస్తానని హామీ
నిర్మాతకు ఈరోజుల్లో విలువ లేదని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. నిర్మాత అంటే 'ఇచ్చేవాడు' అని, కానీ ఇప్పుడు ఇచ్చిన వారిని శాసించే స్థాయిలో పరిశ్రమ ఉందని అన్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావుకు సంబంధించి ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత పూర్ణచంద్రరావు కొన్ని సినిమాలనే నిర్మించారని అన్నారు.

తన 'దిల్' చిత్రాన్ని హిందీలో తీస్తానని, హక్కుల గురించి పూర్ణచంద్రరావు తనను అడిగారని గుర్తు చేసుకున్నారు. ఆయన నిర్మిస్తానంటే హక్కులు ఉచితంగా ఇస్తానని చెప్పానని తెలిపారు. 87 చిత్రాలను నిర్మించిన అట్లూరి సమర్పణలో తాను ఒక సినిమాను నిర్మిస్తానని ప్రకటించారు. విలువలతో కూడిన చిత్రాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
Dil Raju
Telugu cinema
Producer value
Atluri Poornachandra Rao
Dil movie
Film industry
Movie rights

More Telugu News