Alicia Hughes: బరితెగించిన పాఠశాల ఉద్యోగిని... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త!

Alicia Hughes Arrested for Student Affair in Indiana
  • అమెరికాలో ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధాల ఆరోపణలు
  • స్కూల్ సెక్రటరీ అలిసియా హ్యూజెస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఒక విద్యార్థితో ఉండగా భర్తకు పట్టుబడటంతో వెలుగులోకి వచ్చిన ఘటన
  • మైనర్ విద్యార్థి విషయంలో చైల్డ్ సెడక్షన్ కింద ఐదు అభియోగాలు
  • విచారణ పూర్తయ్యే వరకు ఆమెను విధుల నుంచి తొలగించిన పాఠశాల
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఓ హైస్కూల్ ఉద్యోగిని, ఇద్దరు విద్యార్థులతో అనుచిత లైంగిక సంబంధాలు పెట్టుకుందన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే, రాండాల్ఫ్ ఈస్టర్న్ స్కూల్ కార్పొరేషన్‌లో సెక్రటరీగా పనిచేస్తున్న 31 ఏళ్ల అలిసియా హ్యూజెస్‌ 18 ఏళ్ల విద్యార్థితో అనుచిత స్థితిలో ఉండగా ను ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. వారి మధ్య వాగ్వాదం జరగడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. కుటుంబ కలహంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

పోలీసుల దర్యాప్తులో, అలిసియాకు 17 ఏళ్ల మరో విద్యార్థితో కూడా సంబంధం ఉన్నట్లు తేలింది. ఆ మైనర్ విద్యార్థితో కనీసం ఐదుసార్లు లైంగిక చర్యలకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో ఆమెపై ఐదు అభియోగాల కింద 'చైల్డ్ సెడక్షన్' కేసు నమోదు చేశారు. 18 ఏళ్ల విద్యార్థి విషయంలోనూ అదనపు అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను రాండాల్ఫ్ కౌంటీ జైలుకు తరలించారు.

ఈ ఘటనపై స్కూల్ సూపరింటెండెంట్ నీల్ ఆడమ్స్ స్పందించారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు అలిసియాను విద్యార్థులకు దూరంగా ఉంచుతూ విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. విద్యార్థుల గోప్యత దృష్ట్యా మరిన్ని వివరాలు వెల్లడించలేమని, చట్టం ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 


Alicia Hughes
Indiana
Randolph Eastern School Corporation
child seduction case
high school secretary
student affair
sexual misconduct
Neil Adams
crime news

More Telugu News