Shoaib Akhtar: షోయబ్ అక్తర్ ‘యూ-టర్న్’: మొహ్సిన్ నఖ్వీ ‘మంచోడు’ అంటూ కితాబు

Shoaib Akhtar Praises Mohsin Naqvi After Previous Criticism
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓటమి అనంతరం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ పేసర్ షోయబ్ అక్తర్, ఆ తర్వాత మాట మార్చాడు. అసమర్థుల చేతిలో బోర్డు ఉంటే ఇలాగే ఉంటుందని తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో యూటర్న్ తీసుకున్నాడు. తన వ్యాఖ్యలను భారత టీవీ ఛానెళ్లు వక్రీకరించాయని ఆరోపిస్తూ వివరణ ఇచ్చాడు.

ఓ పాకిస్థానీ వార్తా సంస్థతో మాట్లాడిన అక్తర్.. "నేను మొహ్సిన్ నఖ్వీని అసమర్థుడని అనలేదు. అంతర్జాతీయ క్రికెట్‌ను నడిపిస్తున్న ఉన్నతాధికారుల గురించి ఆ మాట అన్నాను. మొహ్సిన్ భాయ్ చాలా మంచి వ్యక్తి, పాక్ క్రికెట్‌కు సేవ చేయాలని తపిస్తున్నాడు. కానీ ఆయన చుట్టూ ఉన్నవారు సరైన సలహాలు ఇవ్వడం లేదు" అని సర్దిచెప్పుకొచ్చాడు. 

15న కొలంబోలో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు, భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమితో పాక్ జట్టు సూపర్-8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లలో పాక్‌పై భారత్ 8-1 ఆధిక్యంతో తిరుగులేని రికార్డును కొనసాగిస్తోంది. టోర్నీలో ముందడుగు వేయాలంటే పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌లో నమీబియాపై తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
Go Back to Shorts
Shoaib Akhtar
Mohsin Naqvi
PCB Chairman
Pakistan Cricket
T20 World Cup
India vs Pakistan
Salman Ali Agha
Pakistan Team
Cricket
T20 World Cup 2024

More Telugu News