రూ.1.28 లక్షల కోట్ల బంగారం మిస్సింగ్... ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!

Business
Advertisement
  • ఆర్బీఐ ఖజానా నుంచి రూ.1.28 లక్షల కోట్ల విలువైన బంగారం మాయమైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి సంబంధించి బంగారం నిల్వల డేటాను విడుదల చేసిన ఆర్బీఐ
  • బంగారం నిల్వల మొత్తం విలువ గణనీయంగా తగ్గినట్లు ఆ డేటాలో పేర్కొన్న ఆర్బీఐ
  • ఆ అంశం ఆధారంగా ఓ హిందీ దినపత్రికలో రూ.1.28 లక్షల కోట్ల బంగారం మిస్సింగ్ అంటూ కథనం
  • ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమన్న పీఐబీ, ఆర్బీఐ
Advertisement
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఖజానా నుంచి రూ.1.28 లక్షల కోట్ల విలువైన బంగారం మాయమైందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌తో పాటు ఆర్‌బీఐ కూడా ఖండించింది. ఈ తరహా తప్పుడు పోస్టులను నమ్మొద్దని ప్రజలకు సూచించాయి. 

అసలు విషయం ఏమిటంటే..ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి సంబంధించి ఆర్‌బీఐ బంగారం నిల్వల డేటాను విడుదల చేసింది. అయితే ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గడంతో.. ఆర్‌బీఐ వద్ద ఉన్న బంగారం నిల్వల మొత్తం విలువ గణనీయంగా తగ్గినట్లు ఆ డేటాలో పేర్కొంది. ఈ అంశాన్ని ఆధారంగా తీసుకుని ఓ హిందీ దినపత్రిక ప్రచురించిన వార్తలో రూ.1.28 లక్షల కోట్ల బంగారం మిస్సింగ్ అయినట్లు భావించేలా కథనం రావడంతో గందరగోళం ఏర్పడింది. దానిని ఆధారంగా చేసుకుని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. 

దీనిపై స్పందించిన పీఐబీ, ఆర్‌బీఐ..ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపాయి. బంగారం విలువ మాత్రమే తగ్గిందని, భౌతికంగా బంగారం నిల్వల్లో ఎలాంటి తేడా లేదని స్పష్టం చేశాయి. అధికారిక సమాచారం కోసం ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచించాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Reserve Bank of IndiaRBIGold ReservesGold MissingPIB Fact CheckRBI GoldGold Value DecreaseFake NewsSocial Media RumorsIndia Gold

More Telugu News

అండర్-19 ఆసియా కప్: నేపాల్‌తో భారత్ తొలి పోరు.. అందరి కళ్లు సెహ్వాగ్, ద్రావిడ్ వారసులపైనే!

06 Nov, 09:20

'రామాయణ' ఫస్ట్ డే కలెక్షన్స్.. భారీ ఓపెనింగ్స్ కానీ అంచనాలు మిస్!

06 Nov, 09:17

కేరళం నుంచి అమెరికా వరకు.. లాస్‌ఏంజెల్స్‌ మేయర్‌గా భారతీయ మహిళ!

06 Nov, 09:10

మా ‘లడ్డూ’ను వెతికి పెడితే రూ.లక్ష రివార్డు ఇస్తాం.. పెంపుడు చిలుక కోసం యజమానుల విన్నపం

06 Nov, 08:56

భారతీయుల్లోనే ప్రత్యేక గుండెజబ్బు.. కారణాలను కనుగొన్న హైదరాబాద్ శాస్త్రవేత్తలు

06 Nov, 08:55

భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం.. 'ప్రళయ్' పరీక్ష సక్సెస్

06 Nov, 08:41

ట్రంప్ హెచ్చరికల వేళ.. అమెరికాకు 7 షరతులతో ఇరాన్ ప్రతిపాదన!

06 Nov, 08:40

అంతర్జాతీయ ఎమ్మీ వేదికపై విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత

06 Nov, 08:26

ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్: రంగంలోకి ఈడీ.. ఏకకాలంలో ఏడు చోట్ల సోదాలు

06 Nov, 08:09

‘మురసు’ పెను విలయం: ఏపీలో 8 మంది బలి, రూ.1918 కోట్ల నష్టం

06 Nov, 08:01

ఐపీఎల్‌లో సరికొత్త సంచలనం.. రిటెన్షన్‌కు 40 కోట్లు డిమాండ్ చేస్తున్న స్టార్స్!

06 Nov, 07:49

ఏఐ దెబ్బ.. స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలు! సామాన్యులపై భారీ భారం

06 Nov, 07:25

అమెరికాలో ఘోర ప్రమాదం.. పొన్నూరు యువకుడి దుర్మరణం

06 Nov, 07:00

ట్రంప్ ప్రభుత్వంలో తొలి వికెట్.. పౌర హక్కుల విభాగం చీఫ్ హర్మీత్ థిల్లాన్ రాజీనామా

06 Nov, 06:43

బోస్టన్‌లో నల్గొండ యువతి అదృశ్యం... కొనసాగుతున్న గాలింపు

06 Nov, 06:28
..More Telugu News