Telangana Government: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. వరి బోనస్ బకాయి నిధులను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న రూ.514.36 కోట్ల బోనస్ నిధులను విడుదల చేసింది. దీంతో 2.17 లక్షల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. 

వరి రైతులకు సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ బోనస్ ద్వారా 2025-26లో ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన రెండు లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం కలగనుంది. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడం, సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం వరి క్వింటాల్‌పై రూ.500 బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే. కనీస మద్దతు ధరకు ఈ రూ.500 అదనం. బకాయిల చెల్లింపుతో రైతులకు ఆర్థిక ఉపశమనం లభిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Telangana Government
Telangana farmers
Paddy bonus
Uttam Kumar Reddy
Telangana agriculture

More Telugu News