అమెరికాతో ట్రేడ్ డీల్: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ 5 ప్రశ్నలు
- అమెరికా వాణిజ్య ఒప్పందంపై మోదీ సర్కార్‌పై రాహుల్ దాడి
- ప్రధాని మోదీకి 5 సూటి ప్రశ్నలు సంధించిన రాహుల్
- ఈ ఒప్పందం రైతులకు ద్రోహం చేయడమేనని ఆరోపణ
- జీఎం పంటలు, సోయా, పాల రంగాలపై ప్రభావంపై ఆందోళన
- భారత వ్యవసాయంపై అమెరికా పట్టు సాధిస్తుందని హెచ్చరిక
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, మోదీ ప్రభుత్వంపై తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. ఈ ఒప్పందం భారత రైతులకు చేసిన ద్రోహమని ఆరోపిస్తూ, ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి ఐదు సూటి ప్రశ్నలు సంధించారు. ఈ వివాదాస్పద ఒప్పందంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వాణిజ్య ఒప్పందం వల్ల జన్యుపరంగా మార్పు చేసిన (జీఎం) పంటలు, సోయా రైతులపై పడే ప్రతికూల ప్రభావాల గురించి రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రైతులకు అందుబాటులో ఉన్న రక్షణ కవచాలను కేంద్ర ప్రభుత్వం తొలగిస్తోందని ఆరోపించారు. ఈ ఒప్పందం కేవలం నేటి సమస్య కాదని, భవిష్యత్తులో భారత వ్యవసాయ వ్యవస్థపై మరో దేశానికి దీర్ఘకాలికంగా పట్టును అప్పగించడమేనని ఆయన విమర్శించారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ, ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ రాహుల్ గాంధీ ఈ ఐదు ప్రశ్నలను లేవనెత్తారు.
1. డీడీజీ (డిస్టిల్లర్స్ డ్రైడ్ గ్రెయిన్) దిగుమతి చేసుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అంటే, అమెరికా జీఎం మొక్కజొన్నల నుంచి తీసిన ధాన్యాన్ని మన పశువులకు మేపడమేనా? ఇది మన పాల పరిశ్రమను అమెరికా వ్యవసాయ వ్యవస్థతో అనుసంధానం చేయదా?
2. జీఎం సోయా నూనె దిగుమతులకు అనుమతిస్తే.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మన సోయా రైతుల పరిస్థితి ఏంటి? మరోసారి ధరల పతనాన్ని వారు ఎలా తట్టుకుంటారు?
3. మీరు చెబుతున్న 'అదనపు ఉత్పత్తులు' జాబితాలో ఏముంటాయి? పప్పుధాన్యాలు, ఇతర సున్నితమైన పంటలను కూడా కాలక్రమేణా అమెరికా దిగుమతులకు తెరవాలనే ఒత్తిడికి ఇది సంకేతమా?
4. 'వాణిజ్యేతర అడ్డంకులు' తొలగించడం అంటే ఏమిటి? జీఎం పంటలపై భారత్ తన వైఖరిని నీరుగార్చాలా? సేకరణను బలహీనపరచాలా? లేదా భవిష్యత్తులో కనీస మద్దతు ధర, బోనస్‌లను నిర్వీర్యం చేయాలా?
5. ఒక్కసారి ఈ తలుపు తెరిస్తే, అది ఏటా మరింత పెద్దది కాకుండా ఎలా నివారిస్తాం? రైతులకు తగిన రక్షణ కవచాలు ఉంటాయా? లేక ప్రతి చర్చలోనూ మరిన్ని పంటలను బేరసారాలకు పెడతారా?
ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.