Revanth Reddy: మంచి ఫలితాలు సాధించారు: మంత్రులు, నేతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

Revanth Reddy Congratulates Leaders on Municipal Election Results
షార్ట్స్‌లో చూడండి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో మంత్రులు, సీనియర్ నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నిన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత రెండేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ఆ నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దేశానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana
Municipal Elections
Congress Party
Hyderabad
Welfare Schemes
Development Programs
Telangana Politics

More Telugu News