Bandla Ganesh: నారా లోకేశ్ పై బండ్ల గణేశ్ ఆసక్తికర ట్వీట్
- టీడీపీ నాయకత్వంపై నటుడు బండ్ల గణేశ్ ప్రశంసలు
- నాయకత్వం అంటే పదవి కాదని, బాధ్యత అని వ్యాఖ్య
- సీనియర్ల అనుభవం, లోకేశ్ ఉత్సాహం గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయని వెల్లడి
- అధికారంలో ఉన్నా వినయంగా ఉండటమే నిజమైన నాయకత్వ లక్షణమన్న గణేశ్
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి తన రాజకీయ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంపైనా, మంత్రి నారా లోకేశ్ పైనా ఆయన ప్రశంసలు కురిపిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాయకత్వానికి ఉండాల్సిన లక్షణాలను వివరిస్తూ, టీడీపీలో ప్రస్తుతం ఉన్న మేలైన కలయికను ఆయన ప్రస్తావించారు.
ఈ మేరకు ఆయన పెట్టిన పోస్టులో, "నాయకత్వం అంటే కేవలం పదవి కాదు, అది బాధ్యత. వినయం అంటే బలహీనత కాదు, అది మహోన్నత గుణం" అని పేర్కొన్నారు. టీడీపీలోని సీనియర్ నాయకుల అనుభవం, యువ నాయకుడు నారా లోకేశ్ ఉత్సాహం రెండూ కలిసి పార్టీలో ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
"అధికారంలో ఉన్నప్పటికీ అహంకారం లేకుండా, ముందుకు నడిపించే ధైర్యంతో పాటు వినయాన్ని కాపాడుకోవడమే నిజమైన నాయకత్వ లక్షణం. నిజమైన నాయకుడు ముందుండి నడిపించడమే కాదు, తనతో పాటు అందరినీ ముందుకు తీసుకెళతాడు" అని బండ్ల గణేశ్ తన పోస్టులో వివరించారు.
అంతేకాదు, తన పోస్టుకు ఒక ఆసక్తికరమైన ఫొటోను కూడా బండ్ల గణేశ్ జోడించారు. లోకేశ్ గతరాత్రి ఉండవల్లి నివాసంలో అనకాపల్లి, చిత్తూరు జిల్లాల కూటమి ప్రజాప్రతినిధులకు విందు ఇవ్వడం తెలిసిందే. ఈ సందర్భంగా లోకేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడితో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోను బండ్ల గణేశ్ పంచుకున్నారు.