వారణాసి ఏ జానర్ మూవీ?... రాజమౌళి సమాధానం ఇదే!
- మహేశ్ బాబు వారణాసి మూవీపై వివిధ ఊహాగానాలు
- ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా అంటూ ప్రచారం
- ఇది ఫాంటసీ –మైథలాజికల్ మూవీ అన్న రాజమౌళి
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’పై ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతోంది. హీరోగా మహేశ్ బాబు నటిస్తుండగా, ఈ చిత్రం ఏ జానర్‌కు చెందిందన్న దానిపై వివిధ ఊహాగానాలు వినిపించాయి. టైటిల్ గ్లింప్స్ విడుదలైన తర్వాత కథపై మరింత ఆసక్తి పెరిగింది.
ఇక ఆటోమేటిక్ వీల్‌చైర్‌లో విలన్ పాత్రలో కనిపించిన ఫృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్‌లుక్ ఆధారంగా ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి స్వయంగా రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘వారణాసి’కి సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉన్నా, ఇది ఆ జానర్ సినిమా కాదని స్పష్టం చేశారు. ఇది ఫాంటసీ –మైథలాజికల్ మూవీ అని వెల్లడించారు.
ఆర్ఆర్ఆర్ విజయంతో ఎలాంటి ఒత్తిడి లేదని రాజమౌళి తెలిపారు. కొత్త సినిమా ప్రారంభించినప్పుడు గత చిత్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకోనన్నారు. రుద్ర పాత్రలో వృషభంపై మహేశ్ ఎంట్రీ ‘వారణాసి’లో గ్రేటెస్ట్ సినిమాటిక్ మూమెంట్ అవుతుందన్నారు. దర్శకుడిగా ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త అనుభూతి ఇవ్వాలనుకుంటానని తెలిపారు. అది కేవలం విజువల్స్ పరంగానే కాదు, భావోద్వేగాల పరంగానూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ మూవీ రన్‌టైమ్ మూడు గంటల కంటే తక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నానన్నారు.
పూర్తి సినిమాను ఐమ్యాక్స్ వెర్షన్‌లో తెరకెక్కించాలని భావించినప్పటికీ, కొన్ని పరిమితుల కారణంగా కొన్ని సన్నివేశాలనే ఆ ఫార్మాట్‌లో రూపొందిస్తున్నామని తెలిపారు. రామాయణం ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, దానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు సవాలుగా ఉన్నాయని చెప్పారు. ఈ భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.