Telangana Congress: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా... రెండో స్థానంలో బీఆర్ఎస్
తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుని తన పట్టును నిరూపించుకుంది. శాసనసభ ఎన్నికల తర్వాత జరిగిన ఈ కీలక పోరులో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 64 చోట్ల విజయం సాధించింది. మొత్తం 2,582 వార్డులకు గాను 1,347 వార్డుల్లో హస్తం గుర్తు అభ్యర్థులు గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ కేవలం 13 మున్సిపాలిటీలు, 717 వార్డులతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇక బీజేపీ 261 వార్డుల్లో, ఇండిపెండెంట్ అభ్యర్థులు 256 వార్డుల్లో గెలిచారు.
మరో 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతాల్లో ఛైర్మన్ల ఎన్నికలో స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతు కీలకం కానుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలుచుకోవడం విశేషం.
కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లను కాంగ్రెస్ దక్కించుకుంది. ఇంకా పలు చోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడాల్సి ఉంది.