Chandrababu Naidu: నీట్‌ ఆధారంగా నర్సింగ్‌ ప్రవేశాలు: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Government Approves NEET for Nursing Admissions
షార్ట్స్‌లో చూడండి
విద్యా రంగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలను నీట్-యూజీ పరీక్ష ఆధారంగా నిర్వహించాని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. 

2026-27 విద్యా సంవత్సరానికి గాను నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్షను విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఉన్నతాధికారులతో ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నర్సింగ్ ప్రవేశాలకు ఉత్తమ విధానంపై చర్చించారు. అనంతరం నీట్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
AP Government
Andhra Pradesh
NEET UG
BSc Nursing
Nursing Admissions
Medical Education
Satya Kumar Yadav
Education News
AP News

More Telugu News