Ramayampet Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: రామాయంపేటలో భార్యాభర్తల విజయం
- కాంగ్రెస్ పార్టీ నుంచి చెరో వార్డులో విజయం సాధించిన భార్యాభర్తలు
- బెజవాడ నాగరాజు, భార్య లావణ్య విజయం
- తెలంగాణలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు అత్యధిక మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ భార్యాభర్తలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెండు వార్డుల నుంచి విజయం సాధించడం గమనార్హం.
ఓ వార్డు నుంచి బెజవాడ నాగరాజు 126 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థిపై విజయం సాధించగా, మరో వార్డు నుంచి నాగరాజు భార్య లావణ్య 281 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఫలితాలను చూస్తే కాంగ్రెస్ 48 మున్సిపాలిటీలను, బీఆర్ఎస్ 10, ఇతరులు 14 మున్సిపాలిటీలలో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో వార్డుల పరంగా చూస్తే కాంగ్రెస్ 1,187, బీఆర్ఎస్ 638, బీజేపీ 214, ఇతరులు 212 వార్డుల్లో విజయం సాధించారు.