Rahul Gandhi: ఎంపీపై అనర్హత వేటు ప్రొసీజర్ ఇదే!

లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. అమెరికాతో కుదిరిన ట్రేడ్ డీల్ ను విమర్శిస్తూ.. దేశాన్ని అమెరికాకు అమ్మేశారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడాన్ని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబె తీవ్రంగా పరిగణించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. సభ నుంచి బహిష్కరించడంతో పాటు రాహుల్ గాంధీని జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరారు. సభ్యత్వ రద్దు ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ లోక్ సభలో నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో ఎంపీల సభ్యత్వాన్ని తొలగించే ప్రక్రియపై చర్చ జరుగుతోంది.

ఫిర్యాదు నోటీసులతో ప్రక్రియ ప్రారంభం..
పార్లమెంట్ సభ్యుడికి వ్యతిరేకంగా సహచర సభ్యుడు లేదా పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేయడంతో తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఫిర్యాదు (నోటీసు)ను స్పీకర్ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తారు. సభ్యుడిపై వచ్చిన ఆరోపణలపై కమిటీ విచారణ జరిపి స్పీకర్ కు నివేదిక సమర్పిస్తుంది. సదరు సభ్యుడిని దోషిగా తేల్చి, అతడిపై అనర్హత వేటు వేయాలని రికమెండ్ చేస్తే ఆ రిపోర్టును స్పీకర్ లోక్ సభలో చర్చకు పెడతారు. దీనికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపితే సదరు సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది.
Rahul Gandhi
Rahul Gandhi disqualification
Nishikant Dubey
Lok Sabha
Ethics Committee
Parliament procedure
MP disqualification process
Indian Politics

More Telugu News