Jaggareddy: సీఐ కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారని ఆరోపణ... జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం

Jaggareddy Angered by CI Action Against Congress Candidate
  • సీఐపై చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్
  • పోలింగ్ ఆపేస్తామంటూ బూత్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం
  • పోలీసులు, జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం
సంగారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్నసీఐ... కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారని ఆరోపిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలింగ్ ఆపేస్తామంటూ బూత్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పోలీసులు, జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు సీఐ సహకరిస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఐని సస్పెండ్ చేయకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
Jaggareddy
Sangareddy
Telangana Municipal Elections
Congress
TRS
BRS
Polling Rigging Allegations

More Telugu News