లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానా.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెచ్చరిక

Telangana
Advertisement
  • మార్చి 1 నుంచి నిరంతరాయంగా స్పెషల్ డ్రైవ్
  • సిటీలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడి
  • లైసెన్స్ లేని వారికి వాహనం ఇవ్వడమూ నేరమేనని వార్నింగ్
Advertisement
డ్రైవింగ్ లెసెన్స్ లేకున్నా బైక్ పై దూసుకెళుతున్నారా.. మైనర్లు, లైసెన్స్ లేని వారికి వాహనం ఇచ్చి పంపిస్తున్నారా.. ఇకపై ఇలా కుదరదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కారంటే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందని, కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారి వల్లే రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం చోటుచేసుకుంటున్నాయని, దీనిని నివారించేందుకు తనిఖీలు చేపట్టనున్నామని వివరించారు.

మార్చి 1 నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిరంతరం ‘స్పెషల్ డ్రైవ్’ చేపట్టబోతున్నట్లు తెలిపారు. తనిఖీలలో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వెంటనే ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, ఆ తర్వాతే వాహనం నడపాలని హితవు పలికారు. వాహనం నడుపుతూ బయటకు వస్తే తప్పనిసరిగా ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

లైసెన్స్ లేని వ్యక్తులకు వాహనం ఇవ్వొద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వాహనం నడిపే అర్హత లేని వారికి వాహనాలు ఇవ్వడం నేరమని చెబుతున్నారు. మీ వాహనంతో వారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఎలాంటి పరిహారం రాదని గుర్తుచేశారు. దీనివల్ల ఆర్థిక భారంతో పాటు కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.

నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్..
ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ చలాన్ లను తప్పించుకోవడానికి కొంతమంది తమ వాహనం నంబర్ ప్లేట్ ను ట్యాంపర్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. అంకెలు మార్చడం, నంబరు ప్లేటుకు మాస్కులు తగిలించడం, రంగు పూయడం వంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Hyderabad Traffic PoliceDriving LicenseTraffic RulesRoad AccidentsTraffic ViolationsVehicle LicenseNumber Plate TamperingHyderabadTelanganaTraffic Fines

More Telugu News

‘‘రూ.250 కోట్లు ఖర్చు చేశాం.. ఇది మోసం కాదు’’: రూ.85 వేల టెంపుల్‌ గ్యాడ్జెట్‌పై దీపిందర్‌ గోయల్‌!

06 Nov, 12:57

శ్రీరాముడి వనవాసం 14 ఏళ్లే.. నాకు మాత్రం ఇంకా ముగియలేదు: రేణూ దేశాయ్

06 Nov, 12:48

వన్ మినిట్ వీడియోలతో విష ప్రచారం చేస్తున్నారు: బీద రవిచంద్ర

06 Nov, 12:33

బంగారం Vs వెండి Vs గోల్డ్‌ ఈటీఎఫ్‌లు.. ధనత్రయోదశి వేళ ఏది కొనాలి?

06 Nov, 12:30

హైదరాబాద్‌కు రసాయనాలతో తయారు చేసిన కల్తీ పాల సరఫరా.. రంగారెడ్డి జిల్లాలో గుట్టురట్టు!

06 Nov, 12:27

రాముడు, రావణుడి అసలైన వైభవాన్ని, శక్తిని చూడాలంటే తప్పకుండా 'రామాయణ' చూడాలి: సందీప్ వంగా

06 Nov, 12:06

వాట్సాప్‌లో ఇక బ్లూ టిక్స్‌ భయం లేదు.. చాట్‌ ఓపెన్‌ చేయకుండానే మెసేజ్‌లు చదవొచ్చు!

06 Nov, 12:04

పీవీఆర్‌లో మెటా గ్లాసెస్ రగడ.. సిబ్బందితో వ్యక్తి వాదన.. వైరల్ అయిన వీడియో!

06 Nov, 12:02

కృష్ణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై ఆగ్రాలో క్రిమినల్ కేసు

06 Nov, 11:54

భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డే.. వరుణుడే ఆడేస్తాడా? వాతావరణంపై ఉత్కంఠ!

06 Nov, 11:45

'సమ్మర్‌ హాలిడేస్‌' మూవీ రివ్యూ

06 Nov, 11:44

టీమిండియాలోకి రీఎంట్రీపై మనసులో మాట చెప్పిన పృథ్వీ షా

06 Nov, 11:32

లాస్ ఏంజిల్స్ మేయర్‌గా భారత సంతతి మహిళ.. మన వ్యవస్థపై శశి థరూర్ వ్యాఖ్యలు

06 Nov, 11:20

ట్రావెల్స్‌ వ్యాపారులకు టయోటా గుడ్‌న్యూస్‌.. ఇన్నోవా క్రిస్టా లిమో వచ్చేసింది!

06 Nov, 11:19

కడుపులోకి వెళ్లిన టూత్ బ్రష్.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు!

06 Nov, 11:17
..More Telugu News