పాఠశాల ప్రారంభిస్తున్న కుంభమేళా బ్యూటీ!

Entertainment
Advertisement
  • ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో దండలు అమ్ముతూ ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాప్యులరైన మోనాలిసా
  • సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన మోనాలిసా
  • మోనాలిసా తన తొలి హిందీ సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై భావోద్వేగానికి గురైన వైనం
  • మహా కుంభమేళాలో దండలు అమ్ముతున్న రోజుల్లో తాను ఇంత దూరం వస్తానని కలలో కూడా ఊహించలేదన్న మోనాలిసా
Advertisement
తన మొదటి సినిమా రెమ్యునరేషన్‌తో పాఠశాల ప్రారంభిస్తానని కుంభమేళా బ్యూటీగా పాప్యులర్ అయిన మోనాలిసా ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో దండలు అమ్ముతూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన మోనాలిసా ఇప్పుడు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సాధారణ జీవితం నుంచి ప్రారంభమైన ఆమె ప్రయాణం వెండితెర వరకు చేరుకోవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహాకుంభ్‌లో వైరల్ అయిన తర్వాత వచ్చిన అవకాశాలతో మోనాలిసా ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఆమె తొలి హిందీ సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై భావోద్వేగానికి గురైంది. సినీ ప్రపంచంతో పాటు, తన పాత జీవితాన్ని కూడా సమానంగా ప్రేమిస్తున్నానని మోనాలిసా వెల్లడించింది.
 
ఇక తాజాగా ఆమె మళ్లీ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి గంగా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి కృతజ్ఞతలు తెలిపింది. మహా కుంభమేళాలో దండలు అమ్ముతున్న రోజుల్లో తాను ఇంత దూరం వస్తానని కలలో కూడా ఊహించలేదని చెప్పింది. తన జీవితాన్ని మార్చిన ఈ అవకాశాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతోనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తన మొదటి సినిమా నుంచి అందే రెమ్యునరేషన్‌తో మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాలో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించాలన్నదే తన కల అని మోనాలిసా తెలిపింది. ఆ ప్రాంతాల్లో అమ్మాయిలకు సరైన విద్యావకాశాలు లేవని, చదువుకోని బాలికలు జీవితంలో వెనుకబడిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
 
బాలికల విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, అందుకే తన సంపాదనను వ్యక్తిగత సౌకర్యాల కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం ఉపయోగించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మోనాలిసా మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో రెండు తెలుగు సినిమాలు కాగా, మరోటి హిందీ సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్. 
Advertisement

సంబంధిత వార్తలు

MonalisaKumambh MelaPrayagrajBollywoodSchool for GirlsEducationKhargonThe Diary of ManipurTelugu movies

More Telugu News

శ్రీరాముడి వనవాసం 14 ఏళ్లే.. నాకు మాత్రం ఇంకా ముగియలేదు: రేణూ దేశాయ్

06 Nov, 12:48

వన్ మినిట్ వీడియోలతో విష ప్రచారం చేస్తున్నారు: బీద రవిచంద్ర

06 Nov, 12:33

బంగారం Vs వెండి Vs గోల్డ్‌ ఈటీఎఫ్‌లు.. ధనత్రయోదశి వేళ ఏది కొనాలి?

06 Nov, 12:30

హైదరాబాద్‌కు రసాయనాలతో తయారు చేసిన కల్తీ పాల సరఫరా.. రంగారెడ్డి జిల్లాలో గుట్టురట్టు!

06 Nov, 12:27

రాముడు, రావణుడి అసలైన వైభవాన్ని, శక్తిని చూడాలంటే తప్పకుండా 'రామాయణ' చూడాలి: సందీప్ వంగా

06 Nov, 12:06

వాట్సాప్‌లో ఇక బ్లూ టిక్స్‌ భయం లేదు.. చాట్‌ ఓపెన్‌ చేయకుండానే మెసేజ్‌లు చదవొచ్చు!

06 Nov, 12:04

పీవీఆర్‌లో మెటా గ్లాసెస్ రగడ.. సిబ్బందితో వ్యక్తి వాదన.. వైరల్ అయిన వీడియో!

06 Nov, 12:02

కృష్ణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై ఆగ్రాలో క్రిమినల్ కేసు

06 Nov, 11:54

భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డే.. వరుణుడే ఆడేస్తాడా? వాతావరణంపై ఉత్కంఠ!

06 Nov, 11:45

'సమ్మర్‌ హాలిడేస్‌' మూవీ రివ్యూ

06 Nov, 11:44

టీమిండియాలోకి రీఎంట్రీపై మనసులో మాట చెప్పిన పృథ్వీ షా

06 Nov, 11:32

లాస్ ఏంజిల్స్ మేయర్‌గా భారత సంతతి మహిళ.. మన వ్యవస్థపై శశి థరూర్ వ్యాఖ్యలు

06 Nov, 11:20

ట్రావెల్స్‌ వ్యాపారులకు టయోటా గుడ్‌న్యూస్‌.. ఇన్నోవా క్రిస్టా లిమో వచ్చేసింది!

06 Nov, 11:19

కడుపులోకి వెళ్లిన టూత్ బ్రష్.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు!

06 Nov, 11:17

కుటుంబంలోని ఏడుగురి హత్య .. భార్యపై కక్షతో రాక్షసుడిగా మారిన క్యాబ్ డ్రైవర్‌

06 Nov, 11:15
..More Telugu News