మెదక్ జిల్లాలో కలకలం రేపుతున్న చిరుత సంచారం
- అల్లాదుర్గం మండలంలో జాతీయ రహదారి పక్కన చిరుత సంచారం
- అధికారులకు సమాచారం అందించిన స్థానికులు
- సమీప తండాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అటవీ శాఖ అధికారులు
విషయం తెలుసుకున్న తహసీల్దార్ మల్లయ్య, ఎస్ఐ శంకర్, ఏఎస్ఐ గాలయ్యలు అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు వివరాలు తెలియజేశారు. చిరుత ఎవరికి ఎలాంటి హాని తలపెడుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గొల్లకుంట తండా, గాండ్లబాయి తండా, మాందాపూర్, చిల్వేర్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.