Pinnelli Ramakrishna Reddy: కోర్టులో పిన్నెల్లి బ్రదర్స్‌కు లభించని ఊరట

Pinnelli Brothers Bail Plea Rejected in Court
  • జంట హత్యల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి సోదరులు 
  • జ్యుడీషియల్ రిమాండ్ లో వున్న నిందితులు 
  • బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన గురజాల కోర్టు న్యాయమూర్తి
జంట హత్యల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి గురజాల కోర్టులో ఊరట లభించలేదు. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో గతేడాది మే 24న టీడీపీ నేతలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, జెవిశెట్టి కోటేశ్వరరావుల జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6), వెంకట్రామిరెడ్డి (ఏ7), వెంకటరెడ్డి (ఏ8) నిందితులుగా ఉన్నారు. 

ఈ కేసులో పిన్నెల్లి వెంకటరెడ్డి గతేడాది డిసెంబర్ 1న, రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి డిసెంబర్ 11న మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. అప్పటి నుంచి వీరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న గురజాలలోని 10వ అదనపు జిల్లా న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. వాదనల అనంతరం న్యాయాధికారి జి.ప్రియదర్శిని బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 
Pinnelli Ramakrishna Reddy
Pinnelli Brothers
Pinnelli Venkatrami Reddy
Macharla
Guntur
Palnadu District
Double Murder Case
TDP Leaders
Andhra Pradesh Politics
Gundlapadu

More Telugu News