ఆర్ఎస్ఎస్ వల్లే బీజేపీకి ‘అచ్ఛే దిన్’
- శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ వ్యాఖ్య
- రామాలయం నిర్మాణంపై ఆర్ఎస్ఎస్ పట్టుదలగా వ్యవహరించిందని వెల్లడి
- ఆలయ నిర్మాణానికి సహకరించిన పార్టీలు లాభపడ్డాయని వివరణ
దేశంలో బీజేపీ అప్రతిహత విజయాలకు ఆర్‌ఎస్ఎస్ విధానాలే కారణమని, సంఘ్ వల్లే బీజేపీకి అచ్ఛే దిన్ వచ్చాయని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో ఆర్ఎస్ఎస్ కు అచ్ఛే దిన్ వచ్చాయన్న వ్యాఖ్యలపై భగవత్ స్పందించారు.
నిజానికి బీజేపీ అధికారంలోకి రావడానికి, ఆ పార్టీకి మంచి రోజులు రావడానికి కారణం ఆర్ఎస్ఎస్ అని చెప్పారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం విషయంలో సంఘ్ పట్టుదలగా వ్యవహరించడం, ఈ ఉద్యమానికి సహకరించిన పార్టీలకు ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. దీంతోపాటు స్వయంసేవకుల కఠోర శ్రమ కూడా ఉందని భగవత్ స్పష్టం చేశారు.
సావర్కర్‌కు భారతరత్నపై..
హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు 'భారతరత్న' ఇవ్వాలనే డిమాండ్‌పై భగవత్ స్పందించారు. అవార్డు కమిటీలో తాను లేనని చెబుతూ.. ఆ కమిటీలో ఉన్న వారిని కలిస్తే ఈ విషయం తప్పకుండా ప్రస్తావిస్తానని చెప్పారు. నిజానికి సావర్కర్ కు భారతరత్న ఇస్తే ఆ అవార్డుకే ఖ్యాతి పెరుగుతుందని చెప్పారు. ఎలాంటి పురస్కారాలు పొందకున్నా కూడా సావర్కర్ కోట్లాది భారతీయుల హృదయాల్లో చక్రవర్తిగా నిలిచారని భగవత్ కొనియాడారు.
ఉపాధి కల్పనపై..
భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి 'మాస్ ప్రొడక్షన్' (భారీ ఉత్పత్తి) కంటే 'ప్రొడక్షన్ బై మాసెస్' (ప్రజల భాగస్వామ్యంతో ఉత్పత్తి) జరగాలని భగవత్ పిలుపునిచ్చారు. ఒకేచోట భారీగా ఉత్పత్తి చేయడం కంటే ఎక్కువ చోట్ల చిన్న తరహా ఉత్పత్తి జరిపితే వస్తువుల ధరలు తగ్గుతాయని చెప్పారు. అప్పుడు కంపెనీల మధ్య పోటీ ధరలపై కాకుండా వస్తువుల నాణ్యతపైకి మారుతుందని వివరించారు. నాణ్యత బాగుండేలా జాగ్రత్త పడితే మన వస్తువులకు విదేశాల్లోనూ డిమాండ్ పెరుగుతుందని తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై..
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతలను స్వాగతించాల్సిన అవసరం ఉందని మోహన్ భగవత్ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిపై పట్టు సాధించాలని సూచించారు. అయితే, టెక్నాలజీ అనేది ఉద్యోగాలను హరించేదిగా ఉండకూడదని, ఉపాధికి భంగం కలగకుండా ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో మనం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.