రాత్రి ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ కానున్న సీఎం
- సాయంత్రం 7.20 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీకి బయల్దేరనున్న చంద్రబాబు
- రాత్రికి 1-జన్ పథ్ నివాసంలో బస
- రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం
పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ ఉన్న బకాయిల విడుదల, పోలవరం పునరావాస ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్మలా సీతారామన్ ను కోరనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు రుణాల ప్రక్రియ, కేంద్రం నుంచి అందాల్సిన వివిధ రకాల గ్రాంట్లపై చంద్రబాబు చర్చించనున్నారు.
ఈ నెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక, ఇతర అంశాలను కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లనున్నారు. అనంతరం రేపు సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి బయల్డేరి 8 గంటలకు విజయవాడ చేరుకుంటారు.