Epstein files: ఎప్ స్టీన్ ఫైల్స్ ఎఫెక్ట్: నార్వే దౌత్యవేత్త మోనా జూల్ రాజీనామా

Norway Diplomat Resigns Following Epstein Files Release
షార్ట్స్‌లో చూడండి
పలువురు ప్రముఖులకు లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్ స్టీన్ తో సంబంధాలు ఉన్నట్లు తాజాగా బయటపడింది. అమెరికా న్యాయ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఎప్ స్టీన్ ఫైల్స్ లో నార్వే దౌత్యవేత్త మోనా జూల్ పేరు 33 చోట్ల ప్రస్తావనకు వచ్చింది.

ఎప్ స్టీన్ తన వీలునామాలో మోనా ఇద్దరు పిల్లలకు 10 మిలియన్ డాలర్లు రాయడం మరింత సంచలనం సృష్టించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో నార్వే విదేశాంగ శాఖ ఆమెను పదవి నుంచి తాత్కాలికంగా తప్పించింది. మోనాపై విచారణకు ఆదేశించింది. ఈ పరిణామంతో మోనా తన పదవికి రాజీనామా చేసింది.

నార్వే క్రౌన్ ప్రిన్స్ మెట్టే మారిట్, మాజీ ప్రధాని థోర్బ్ జార్న్ జాగ్లాండ్ పేర్లు కూడా ఎప్ స్టీన్ ఫైల్స్ లో ప్రస్తావనకు వచ్చాయి. 2008 లో ఓ మైనర్ బాలికతో ప్రాస్టిట్యూషన్ చేయించాడని ఎప్ స్టీన్ పై కేసు నమోదైంది. ఓవైపు ఈ కేసు విచారణ జరుగుతుండగానే నార్వే క్రౌన్ ప్రిన్స్ మెట్టె మారిట్ ఎప్ స్టీన్ తో స్నేహం నెరపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మారిట్ 2011 నుంచి 2014 వరకు ఎప్ స్టీన్ తో స్నేహం కొనసాగించినట్లు తాజాగా బయటపడ్డ ఫైల్స్ తో వెల్లడైంది. మరోవైపు, నార్వేకు ప్రధానిగా వ్యవహరించడంతో నోబెల్ కమిటీకి కూడా జాగ్లాండ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయనకు కూడా ఎప్ స్టీన్ తో సంబంధాలు ఉన్న విషయం తాజా ఫైల్స్ ద్వారా వెలుగులోకి వచ్చింది.
Go Back to Shorts
Epstein files
Norway
Mona Juul
Jeffrey Epstein
Norwegian diplomat
Mette Marit
Thorbjorn Jagland
sex trafficking
Norway Crown Prince
US Justice Department

More Telugu News