Donald Trump: ఎప్ స్టీన్ ఫైల్స్ లోనూ ట్రంప్ మతిమరుపు ప్రస్తావన

Epstein Files Mention Donald Trumps Memory Issues
  • 2017లో జరిగిన ఓ పార్టీలో ట్రంప్ తన పాత స్నేహితులను గుర్తించలేదన్న ఎప్ స్టీన్
  • డిమెన్షియాతో బాధపడుతున్నాడేమోనని అప్పట్లోనే అనుమానాలు
  • దీనిపై ట్రంప్ బయోగ్రఫీ రాస్తున్న మైఖేల్ వోల్ఫ్ కు ఎప్ స్టీన్ ఈమెయిల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జ్ఞాపకశక్తిపై ఇటీవల సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. బహిరంగ సభల్లో, కీలక వేదికలపై ఆయన ఉన్నట్టుండి ప్రసంగం ఆపేయడం, వ్యక్తుల పేర్లను మరిచిపోయిన సంఘటనల తర్వాత ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయం ఎప్ స్టీన్ ఫైల్స్ లోనూ ప్రస్తావనకు వచ్చినట్లు తాజాగా విడుదల చేసిన ఫైల్స్ లో బయటపడింది. మతిమరుపు వ్యాధి డిమెన్షియాతో బాధపడుతున్నాడేమోనని అప్పట్లోనే ఆయన స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేసినట్లు ఎప్ స్టీన్ ఓ ఈమెయిల్ లో పేర్కొన్నాడు.

2017లో జరిగిన ఓ పార్టీకి డొనాల్డ్ ట్రంప్ తో పాటు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారని ఎప్ స్టీన్ చెప్పాడు. అంతకుముందు ట్రంప్ కు కొంతకాలం సన్నిహితంగా మెలిగిన స్నేహితులనూ ఆయన గుర్తుపట్టలేదని చెప్పాడు. దీంతో ట్రంప్ జ్ఞాపకశక్తిపై వారు సందేహం వ్యక్తం చేశారని అన్నాడు. ట్రంప్ కుటుంబంలో డిమెన్షియా బాధితులు ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ట్రంప్ ను కూడా ఈ సమస్య వేధిస్తున్నట్లు ఉందని అభిప్రాయపడ్డట్లు వివరించాడు.

ఈ విషయాన్ని అప్పట్లో ఓ జర్నలిస్ట్ కు, ట్రంప్ బయోగ్రఫీ రాస్తున్న మైఖేల్ వోల్ఫ్ కు రాసిన ఈమెయిల్ లో ఎప్ స్టీన్ పేర్కొన్నాడు. కాగా, తన మానసిక ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని ట్రంప్ కొట్టిపారేశారు. ఇటీవల జరిగిన వైద్య పరీక్షల్లో తాను శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉన్నట్లు తేలిందని చెప్పారు.
Donald Trump
Epstein files
Donald Trump memory
Donald Trump dementia
Michael Wolff
US President
Jeffrey Epstein
Trump mental health
Trump health
Trump friends

More Telugu News