T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్.. నెదర్లాండ్స్‌తో పాక్ ఢీ.. టాస్ గెలిచి బౌలింగ్
- కొలంబోలో మ్యాచ్‌కు భారీ వర్ష సూచన
- సూపర్ 8 అవకాశాల కోసం తప్పక గెలవాల్సిన ఒత్తిడిలో పాకిస్థాన్
- ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపిన పాక్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. కొలంబో వేదికగా జరుగుతున్న ఈ గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌పై వరుణుడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కొలంబోలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా అనే ఆందోళన నెలకొంది.
ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు అత్యంత కీలకం. భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించిన వివాదం నేపథ్యంలో సూపర్ 8కు అర్హత సాధించాలంటే పాకిస్థాన్ తన మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన ఒత్తిడిలో ఉంది. నెదర్లాండ్స్‌పై భారీ విజయం సాధించడం ద్వారా తమ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సల్మాన్ సేన లక్ష్యంగా పెట్టుకుంది.
టాస్ గెలిచిన అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడుతూ.. "మేము ముందుగా ఫీల్డింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్‌పై తేమ ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాం. ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగుతున్నాం. నెదర్లాండ్స్ మంచి జట్టు. మా ప్రణాళికలను కచ్చితత్వంతో అమలు చేయడమే మా లక్ష్యం" అని తెలిపాడు.
మరోవైపు నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ.. "మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నాం. అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. గత నెలన్నరగా భారత్, శ్రీలంకల్లోనే ఆడుతూ పరిస్థితులకు అలవాటుపడ్డాం. మా జట్టులో చాలా మంది ఆల్‌రౌండర్లు ఉన్నారు" అని ధీమా వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ జట్టులో బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది వంటి కీలక ఆటగాళ్లు ఉండగా, నెదర్లాండ్స్ జట్టు కూడా పటిష్ఠంగా కనిపిస్తోంది.
ఇరు జట్ల ప్లేయింగ్ XI వివరాలు
పాకిస్థాన్ జట్టు: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ అజామ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్.
నెదర్లాండ్స్ జట్టు: మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), జాక్ లయన్-కాచెట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, పాల్ వాన్ మీకెరెన్.