Rahul Gandhi: నరేంద్ర మోదీపై ట్రంప్ ఒత్తిడి ఉంది: వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ

Rahul Gandhi says Narendra Modi is under pressure from Trump
షార్ట్స్‌లో చూడండి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని ట్రంప్‌కు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికాతో రాజీపడ్డారని అన్నారు. ఆయన పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్ ఒత్తిడి కారణంగా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారని, అంతా అయ్యాక ఇప్పుడు తన ప్రతిష్ఠ మసకబారుతుందేమోనని మోదీ ఆందోళన చెందుతున్నారని అన్నారు.

కొన్ని నెలలుగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందంపై నిన్న రాత్రి సంతకం చేశారని, అకస్మాత్తుగా ఇది ఎలా ఖరారైందని ఆయన ప్రశ్నించారు. ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉండటం వల్లే ఒప్పందం కుదిరిందని అన్నారు. ఎప్ స్టీన్ ఫైల్స్, అమెరికాలో వ్యాపారవేత్త అదానీపై కేసు వంటి వ్యవహారాలు దీనికి కారణమని ఆరోపించారు. ఎప్ స్టీన్ ఫైళ్లలో బయటికి రాని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయని అన్నారు. రైతుల కష్టాన్ని, దేశాన్ని అమ్మేశారని మండిపడ్డారు.

అంతకుముందు భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన ఆత్మకథలోని అంశాలపై లోక్‌సభలో రెండో రోజూ గందరగోళం కొనసాగింది. ప్రభుత్వం తనను సభలో మాట్లాడనివ్వలేదని రాహుల్ ఆరోపించారు. చరిత్రలో మొదటిసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు ఒక ప్రతిపక్ష నేతకు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు.
Go Back to Shorts
Rahul Gandhi
Narendra Modi
Donald Trump
India US trade deal
India America relations
Adani

More Telugu News