హోంమంత్రి అనితపై వ్యాఖ్యలు: గుడివాడ అమర్‌నాథ్‌కు మహిళా కమిషన్ నోటీసులు
- హోంమంత్రి అనితపై వ్యాఖ్యల నేపథ్యంలో అమర్‌నాథ్‌పై మహిళా కమిషన్ సీరియస్
- ఈ నెల 24న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం
- సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపిన కమిషన్
- తన వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించిందన్న గుడివాడ అమర్‌నాథ్
- మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ భావన
వివరణ ఇచ్చేందుకు జూన్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని అమర్‌నాథ్‌ను నోటీసులో ఆదేశించారు. తన వ్యాఖ్యలకు సంబంధించి తగిన ఆధారాలతో సహా వివరణ ఇవ్వాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా స్పందించని పక్షంలో, అందుబాటులో ఉన్న ఫిర్యాదులు, వీడియో క్లిప్‌లు, ఇతర ఆధారాల బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది.
ఇటీవల మంత్రి అనితను ఉద్దేశిస్తూ అమర్‌నాథ్ పరుష వ్యాఖ్యలు చేశారు. ఆమెను "మేకప్ మినిస్టర్" అని, ఆమె మేకప్‌తో గోడలకు పుట్టీ పెట్టుకోవచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.
అయితే, తన వ్యాఖ్యలపై అమర్‌నాథ్ తర్వాత స్పందించారు. టీడీపీ తన మాటలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తోందని ఆరోపించారు. తాను మహిళలను గానీ, ఏ వర్గాన్ని గానీ కించపరచలేదని, ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు మాత్రమే బదులిచ్చానని తెలిపారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, భవిష్యత్తులో అనిత తీరు మారకపోతే ఇలాగే స్పందిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను మహిళల గౌరవానికి భంగం కలిగించేవిగా పరిగణిస్తూ మహిళా కమిషన్ ఈ చర్యలు చేపట్టింది.