'నాగబంధం' ట్రైలర్ విడుదల... విజువల్స్ అదుర్స్!
- విరాట్ కర్ణ హీరోగా పాన్ ఇండియా చిత్రం 'నాగబంధం'
- విడుదలైన ఆసక్తికరమైన థియేట్రికల్ ట్రైలర్
- అభిషేక్ నామా దర్శకత్వంలో మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్
- జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంలో సాగే ఈ కథలో 'నాగబంధం' అనే రహస్య ఆచారాన్ని, నిధి అన్వేషణను ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. బ్రహ్మ కమలం, అనంత పద్మనాభ స్వామి ఆలయం వంటి అంశాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. భారీ విజువల్స్, కవచాలు ధరించిన ఏనుగులు, అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ సంస్థలు సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విరాట్ కర్ణకు జోడీగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్ నటిస్తుండగా.. జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సాహ్నీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'వరల్డ్ ఆఫ్ నాగబంధం' టీజర్‌కు 35 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.