Pandurang: దారుణం.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కూతురును చంపిన తండ్రి

Pandurang Kills Daughter to Contest Sarpanch Election in Maharashtra
  • త్వరలో మహారాష్ట్రలో పంచాయతీ ఎన్నికలు
  • ముగ్గురు కూతుళ్లు ఉండటంతో ఒకరిని తప్పించాలని నిర్ణయం
  • పెద్ద కూతురు ప్రాచీని కాలువలోకి తోసి హత్య చేసిన తండ్రి
మహారాష్ట్రలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కన్న కూతురును ఒక తండ్రి హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. మహారాష్ట్రలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కెరూర్‌కు చెందిన పాండురంగ అనే వ్యక్తి సర్పంచ్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తనకు ముగ్గురు పిల్లలు ఉండటంతో అనర్హుడినవుతానని భావించి పెద్ద కూతురు ప్రాచీ (6)ని హత్య చేశాడు.

తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రస్తుత సర్పంచ్ గణేశ్‌ను కలిసి చెప్పాడు. ముగ్గురు పిల్లల్లో ఒకరిని అడ్డు తొలగించుకోవాలని సర్పంచ్ సూచించాడు. దీంతో ఇరువురు కలిసి ప్రాచీని నిజామాబాద్ జిల్లాలోని ఏఆర్పీ నిజాం సాగర్ కాలువలోకి తోసేసి చంపేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ఇటీవల బాలిక మృతదేహం కాలువలో లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా, తండ్రి హంతకుడు అని గుర్తించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీయగా ఈ దారుణం వెలుగు చూసింది. తండ్రి పాండురంగను, గణేశ్‌ను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Pandurang
Maharashtra
Sarpanch Election
Daughter Murder
Local Elections
Nizamabad
Ganesh

More Telugu News