Kirti Azad: ఓడిపోతామనే భయంతోనే మనతో ఆడకుండా పాక్ తప్పించుకుంటోంది: కీర్తి ఆజాద్

Kirti Azad Slams Pakistan for Avoiding Match with India
షార్ట్స్‌లో చూడండి
టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంకలో భారత్ తో జరిగే మ్యాచ్ కు దూరంగా ఉండాలని పాకిస్థాన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ కీర్తి అజాద్ తప్పుబట్టారు. భారత్ పై గెలవలేమన్న భయంతో భారత్ తో మ్యాచ్ ఆడకుండా తప్పించుకునేందుకు పాక్ యత్నిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. 

పాకిస్థాన్ వంటి ఒక విఫల దేశం మనతో క్రికెట్ ఆడేందుకు నిరాకరిస్తోందని కీర్తి ఆజాద్ అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తరుణంలో... ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకుండా భారత్ అప్పుడు తప్పుకుని ఉంటే... ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా బలమైన సందేశం వెళ్లేదని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ఉగ్రవాద దేశం పాకిస్థాన్ అనే సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిందని అన్నారు. 

మరోవైపు, బీజేపీ ఎంపీ శశాంక్ మణి కూడా పాక్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గెలవలేమని తెలిసినప్పుడు కొందరు మైదానాన్ని వీడి వెళ్లాలనుకుంటారని అన్నారు. ఇండియా గెలుస్తుందనే భయంతోనే మనతో ఆడటానికి పాకిస్థాన్ నిరాకరిస్తోందని చెప్పారు.
Go Back to Shorts
Kirti Azad
India vs Pakistan
T20 World Cup
Pakistan Cricket
Cricket Controversy
Shashank Mani
Terrorism
Pahalgam Attack
Champions Trophy
Cricket News

More Telugu News