Dhurandhar: దేశీయంగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' సరికొత్త చరిత్ర!

Dhurandhar single language film crosses Rs 1000 crore mark
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తాజాగా భారత మార్కెట్‌లో రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధిగమించింది. ట్రేడింగ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా 'ధురంధర్' నిలిచింది.

ఇప్పటివరకు ఈ రికార్డు 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' (రూ.1417 కోట్లు), 'కేజీఎఫ్: ఛాప్టర్ 2' (రూ.1001 కోట్లు), 'పుష్ప 2: ది రూల్' (రూ.1471.1 కోట్లు) పేరిట మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ చిత్రాల సరసన 'ధురంధర్' కూడా చేరింది. అయితే, ఈ సినిమా సాధించిన విజయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకుముందు వెయ్యి కోట్లు వసూలు చేసిన చిత్రాలన్నీ బహుళ భాషల్లో విడుదల కాగా, 'ధురంధర్' మాత్రం కేవలం ఒకే భాష(హిందీ)లో విడుదలై ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం విశేషం.

శాక్‌నిల్క్ రిపోర్ట్ ప్రకారం, 56వ రోజు నాటికి ఈ సినిమా నెట్ క‌లెక్ష‌న్లు రూ.835.6 కోట్లుగా ఉన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ పాకిస్థాన్‌కు చెందిన నలుగురు డేంజరస్ టెర్రరిస్టులను ఎదుర్కొనే పాత్రలో నటించారు. ఆయన పాత్ర మేజర్ మోహిత్ శర్మను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారని ప్రచారం జరిగినా, అది పూర్తిగా కల్పితమని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఈ చిత్రంలో పాకిస్థాన్‌లోని వివిధ జాతుల మధ్య ఉన్న సామాజిక-రాజకీయ అంశాలను కూడా లోతుగా చర్చించారు.
Dhurandhar
Ranveer Singh
Dhurandhar movie
Aditya Dhar
Bollywood movie
Box office collection
Indian cinema
Major Mohit Sharma
Sacknilk
Hindi movie

More Telugu News