బెంగళూరులో వింత దొంగ.. మహిళల లోదుస్తులే అతని టార్గెట్.. వాటిని ఏం చేసేవాడంటే..!
- బెంగళూరులో మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్న యువకుడి అరెస్ట్
- వాటిని ధరించి వీడియోలు తీసుకుంటున్న నిందితుడు
- సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు
- నిందితుడి ఇంట్లో భారీగా స్వాధీనం చేసుకున్న లోదుస్తులు
బెంగళూరులో ఓ వింత దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్లలో చొరబడి మహిళల లోదుస్తులను దొంగిలించి, వాటిని ధరించి వీడియోలు తీసుకుంటున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కేరళకు చెందిన 23 ఏళ్ల అముల్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతను హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఇళ్ల బాల్కనీలలో, బయట ఆరవేసిన మహిళల లోదుస్తులను లక్ష్యంగా చేసుకునేవాడు. పరిసరాల్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని వాటిని దొంగిలించి పరారయ్యేవాడు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలో అతని కదలికలు రికార్డు కావడంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు.
మహిళల లోదుస్తులు దొంగిలించి.. వేసుకుని వీడియోలు!
విచారణలో భాగంగా నిందితుడి నివాసంలో సోదాలు చేయగా, పెద్ద మొత్తంలో దొంగిలించిన మహిళల లోదుస్తులు లభ్యమయ్యాయి. అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, దొంగిలించిన దుస్తులను ధరించి తీసుకున్న అనేక వీడియోలు బయటపడ్డాయి. మహిళల లోదుస్తులు ధరించినప్పుడు తనకు 'మత్తుగా' అనిపిస్తుందని అముల్ విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై హెబ్బగోడి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని సెక్షన్ 303(2) (దొంగతనం), 329(4) (గృహ అతిక్రమణ), 79 (మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనూ బెంగళూరులో ఇదే తరహా ఘటనలు జరిగాయి. 2025 మార్చిలో తుమకూరులో ఓ 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను విద్యార్థినుల లోదుస్తులు దొంగిలిస్తున్నందుకు అరెస్ట్ చేశారు. ఈ నెల 19న కూడా హెబ్బగోడిలో ఓ యువకుడు మహిళల లోదుస్తులు ధరించి బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ మహిళలను భయభ్రాంతులకు గురిచేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.