మహిళా ఐఏఎస్‌పై మీడియాలో కథనం.. తీవ్రంగా స్పందించిన సజ్జనార్

  • మహిళల ప్రతిష్ఠను దెబ్బతీయడాన్ని ఖండించాలన్న సజ్జనార్
  • ఉద్దేశపూర్వకంగా దాడులు ఆందోళనకరమని వ్యాఖ్య
  • వ్యక్తిత్వంపై దాడి అంటే పురోగతిపై దాడి చేసినట్లేనని వ్యాఖ్య
మహిళల, రాజకీయ నాయకుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారి, ఒక మంత్రిపై మీడియాలో వచ్చిన కథనాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ, మీడియా ద్వారా మహిళల ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలను ఖండించాలని కోరారు.

మహిళా అధికారులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రజా జీవితంలో మహిళలను అవమానించడం క్రూరత్వమని, మహిళా ఉద్యోగులపై వ్యక్తిగత దూషణలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వంపై దాడి చేయడం అంటే వారి పురోగతిని అడ్డుకోవడమేనని పేర్కొన్నారు. మహిళలను గౌరవించని సమాజం భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు. భవిష్యత్తు అంతా మహిళలదేనని గుర్తెరగాలని ఆయన సూచించారు.


More Telugu News