హైదరాబాద్‌లోని కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం

  • అల్వాల్‌లోని ట్రూ వ్యాల్యూ కార్ల షోరూంలో చెలరేగిన మంటలు
  • అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన సిబ్బంది, స్థానికులు
  • మంటలను అదుపులోకి తెచ్చేందుకు రెండు ఫైరింజన్లతో ప్రయత్నం
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అల్వాల్‌లోని ట్రూ వ్యాల్యూ కార్ల షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్పందించిన కార్ల షోరూం సిబ్బంది, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

రెండు ఫైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా నల్లటి పొగతో కమ్ముకుపోయింది. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News