కరూర్ తొక్కిసలాట... హీరో విజయ్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన సీబీఐ
- నిన్న ఆరు గంటలకు పైగా విచారించిన సీబీఐ
- తాజాగా మరోసారి నోటీసులు జారీ
- జనవరి 19న విచారణకు హాజరు కావాలని సూచన
ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ తర్వాత విచారణకు రావాలని సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరు కావాలని సూచించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే.