Donald Trump: వెనెజువెలా చమురు ఆదాయంపై ట్రంప్ కీలక నిర్ణయం.. నేషనల్ ఎమర్జెన్సీ విధింపు
- వెనెజువెలా చమురు విక్రయ ఆదాయాన్ని జప్తుల నుంచి రక్షించేందుకు అత్యవసర స్థితి విధింపు
- అమెరికా నియంత్రణలో ఉన్న ఖాతాల్లోనే చమురు విక్రయాల సొమ్ము జమ
- వెనెజువెలా అధ్యక్షుడు మదురో అరెస్ట్ తర్వాత నిధులను సురక్షితంగా ఉంచేందుకు చర్యలు
- అమెరికా ప్రయోజనాలు, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఈ నిధుల వినియోగం!
అమెరికా ఖాతాల్లో ఉన్న వెనెజువెలా చమురు విక్రయాల ఆదాయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ నిధులు ఎలాంటి న్యాయపరమైన జప్తులకు గురికాకుండా చూసేందుకు 'నేషనల్ ఎమర్జెన్సీ'ని ప్రకటించినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికా ట్రెజరీ ఖాతాల్లో ఉన్న వెనెజువెలా నిధులపై ఏ విధమైన అటాచ్మెంట్లు, కోర్టు తీర్పులు లేదా ఇతర జుడీషియల్ చర్యలు చెల్లుబాటు కాకుండా ఈ ఉత్తర్వులు అడ్డుకుంటాయి. వెనెజువెలా ముడి చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంపై అమెరికా తన పట్టును నిలుపుకోవడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశం. వెనెజువెలా రాజకీయ, ఆర్థిక స్థిరత్వం కోసం అమెరికా చేసే ప్రయత్నాలకు ఈ నిధులు కీలకం కానున్నాయి.
అమెరికా దళాలు వెనెజువెలాలో మెరుపు దాడులు నిర్వహించి అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించిన వారం రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. వెనెజువెలా నుంచి అమెరికాలోకి జరుగుతున్న 'నార్కో టెర్రరిజం'ను అరికట్టేందుకే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వాషింగ్టన్ పేర్కొంది. ఈ క్రమంలో వెనెజువెలా నిధులు ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లకుండా ట్రంప్ ప్రభుత్వం ఈ భద్రతను కల్పించింది.
చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం తొలుత అమెరికా నియంత్రణలో ఉన్న అంతర్జాతీయ బ్యాంకుల్లో జమ అవుతుంది. "అమెరికా ప్రభుత్వం విచక్షణ మేరకు ఈ నిధులను వెనెజువెలా, అమెరికా ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తాం" అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. అక్రమ వలసలను అరికట్టడం, ప్రాణాంతక మాదకద్రవ్యాల రవాణాను నిలిపివేయడం వంటి 'అమెరికా ఫస్ట్' ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.