హై డోస్ తీసుకుంటున్నా... తన ఆరోగ్యంపై స్పందించిన ట్రంప్

International
Advertisement
  • తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించిన డొనాల్డ్ ట్రంప్
  • గత 25 ఏళ్లుగా తాను ఆస్పిరిన్ టాబ్లెట్లు మోతాదుకు మించి తీసుకుంటున్నానని వెల్లడి
  • ఆస్పిరిన్ రక్తాన్ని పలుచగా ఉంచడంలో ఎంతో దోహదపడుతుందని వ్యాఖ్య
Advertisement
తన ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని స్పష్టం చేశారు. అయితే వైద్యులు సూచించిన మోతాదుకన్నా ఎక్కువగా తాను ఆస్పిరిన్ తీసుకుంటున్నానని తెలిపారు. వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు.
 
ట్రంప్ ఆరోగ్యంపై గతంలో సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికారు చేశాయి. కొంతకాలం ఆయన బహిరంగంగా కనిపించకపోవడం, కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ‘ట్రంప్ మిస్సింగ్’ అంటూ ప్రచారం కూడా చేశారు. అలాగే ఆయన చేతులు, కాళ్లపై గాయాలు కనిపించడంతో వాటిని కవర్ చేసేందుకు మేకప్ వేసుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిపై అప్పట్లో స్పందించిన ట్రంప్,  తన జీవితంలో ఇప్పటి వరకు ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేనని చెప్పడంతో ఆ పుకార్లకు తెరపడింది.
 
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆరోగ్యంపై ట్రంప్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా తాను ఆస్పిరిన్ టాబ్లెట్లు తీసుకుంటున్నానని, అయితే, డాక్టర్లు రోజుకు 81 మిల్లీగ్రాములు సూచిస్తే తాను మాత్రం 325 మిల్లీగ్రాములు తీసుకుంటున్నానని తెలిపారు. రక్తాన్ని పలుచగా ఉంచడంలో ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. తన గుండెలో చిక్కటి రక్తం ప్రవహించడం తనకు ఇష్టం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
 
ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమాల్లో తాను వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్నానని, తరచూ నిద్రపోతున్నానని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు. తన ఆరోగ్యం గురించి పదే పదే మాట్లాడుతుండటం తనకు ఇబ్బందిగా ఉందన్నారు. వ్యాయామం అంటే తనకు అస్సలు ఇష్టం లేదని, ట్రెడ్‌మిల్‌పై నడవడం లేదా పరిగెత్తడం చాలా బోరింగ్‌గా అనిపిస్తుందన్నారు. చేతులపై కనిపించే కొన్ని గాయాలను దాచేందుకు పది నిమిషాలు మేకప్ వేసుకుంటే సరిపోతుందని కూడా  ఆయన పేర్కొన్నారు.
 
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

ఆరోగ్యకరమైన దీపావళికి సిద్ధమవ్వండి.. ఈ ఒక్క రోజు ఇలా చేస్తే చాలు!

07 Nov, 10:15

హైదరాబాద్‌లో స్నేహం పేరుతో మోసం... కిలోల కొద్దీ బంగారం, వెండి చోరీ

07 Nov, 10:12

అనంతపురం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్

07 Nov, 10:11

ఫిట్‌నెస్ సాధించిన పంత్.. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు లైన్ క్లియర్

07 Nov, 10:09

అతడిలో ఇంకా సత్తా ఉంది.. షమీ విషయంలో సెలక్టర్లు తప్పు చేశారు: రవిశాస్త్రి

07 Nov, 10:07

659 జడ్పీటీసీలు.. 9,821 ఎంపీటీలకు కౌంటింగ్.. పార్టీల వారీగా పూర్తి వివరాలు

07 Nov, 10:03

అభిషేక్ బెనర్జీ ఇంటిపై దాడి.. తనను చంపేందుకేనన్న టీఎంసీ ఎంపీ

07 Nov, 09:46

ధోనీని ‘మాహీ చాచూ’ అని పిలుస్తా.. నటి అనుష్క సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు

07 Nov, 09:44

కీరవాణి ఇంట శుభకార్యం.. ఘనంగా కుమారుడి నిశ్చితార్థం!

07 Nov, 09:42

ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్లు.. అమెరికా సంచలన ఆఫర్!

07 Nov, 09:33

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. సర్వత్ర ఉత్కంఠ

07 Nov, 09:25

పసిడి ధర మళ్లీ పైపైకి.. ఒక్కరోజే భారీ పెరుగుదల

07 Nov, 09:24

వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపావళి.. అధ్యక్షుడికి 'హనుమాన్ చాలీసా' బహుమతి

07 Nov, 09:23

యశస్వి జైస్వాల్ జోరు.. వరుసగా రెండో సెంచరీతో మెరుపులు

07 Nov, 09:19

అక్రమ మైనింగ్‌పై ఏపీ సర్కార్ ఉక్కుపాదం.. బకాయిల వసూలుకు రెవెన్యూ రికవరీ చట్టం!

07 Nov, 09:05
..More Telugu News