హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మన్ కృష్ణచైతన్య ఆత్మహత్యాయత్నం!

  • హైదరాబాద్ లో కలకలం
  • తన నివాసంలో సర్వీస్ గన్ తో కాల్చుకున్న కృష్ణచైతన్య
  • ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స
  • బతికే అవకాశాలు అంతంతమాత్రంగా ఉన్నాయని వైద్యులు చెప్పారన్న రంగనాథ్
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వద్ద గన్ మన్ గా పనిచేస్తున్న కృష్ణచైతన్య ఆత్మహత్యాయత్నం చేశాడు. కృష్ణచైతన్య ఈ ఉదయం తన ఇంట్లో సర్వీస్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, అతడిని కుటుంబ సభ్యులు హుటాహుటీన హైదరాబాద్ ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం కృష్ణచైతన్య ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. 

కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కామినేని ఆసుపత్రికి చేరుకుని, వైద్యులతో మాట్లాడి అతడి పరిస్థితిని తెలుసుకున్నారు. కృష్ణచైతన్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కృష్ణచైతన్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, అతడు బతికే అవకాశాలు అంతంతమాత్రమేనని వైద్యులు చెప్పారని వెల్లడించారు.


More Telugu News