తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు వెల్లడి... వెబ్‌సైట్లో వివరాలు

Telangana
Advertisement
  • తెలంగాణలో గ్రూప్ 3 ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల
  • 1,388 పోస్టులకు గాను 1370 మంది అభ్యర్థుల ఎంపిక
  • అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫలితాలు
  • కోర్టు తీర్పునకు లోబడి జాబితా ఉంటుందన్న టీజీపీఎస్సీ
Advertisement
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త చెప్పింది. గ్రూప్-3 సర్వీసులకు సంబంధించి ప్రొవిజనల్ ఎంపిక జాబితాను గురువారం విడుదల చేసింది. మొత్తం 1,388 పోస్టులకు గాను 1,370 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

2022లో 1388 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ గ్రూప్-3 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించారు. అయితే గ్రూప్-1, 2 వివాదాలు, పలు కోర్టు కేసుల కారణంగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. తాజాగా, ఈ ఏడాది మార్చి 14న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (GRL) ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు కమిషన్ తెలిపింది.

ఎంపికైన వారి హాల్ టికెట్ నంబర్లను అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు తమ వివరాలను చూసుకోవచ్చని టీజీపీఎస్సీ సూచించింది.

అయితే, ప్రస్తుతం విడుదల చేసిన ఈ జాబితా కోర్టులలో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ల తుది తీర్పునకు లోబడి ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే, వారి ఎంపికను ఏ దశలోనైనా రద్దు చేసే అధికారం కమిషన్‌కు ఉంటుందని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ ప్రియాంక ఆలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

TSPSC Group 3 ResultsTelangana jobsGroup 3 resultsTGPSCTelangana Public Service CommissionGovernment jobsPriyanka AlaTSPSC websiteTelangana recruitmentJob notification

More Telugu News

సీసీటీవీల పర్యవేక్షణలో కౌంటింగ్.. సాయంత్రం 4 గంటలకల్లా ఫలితాలు వచ్చే అవకాశం: ఎస్ఈసీ పునేఠా

07 Nov, 12:09

'కౌరిబురి: ది కర్స్ డ్ టెంపుల్' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

07 Nov, 12:07

దీపావళి ధమాకా.. దేశవ్యాప్తంగా రూ.5 లక్షల కోట్ల వ్యాపారం!

07 Nov, 11:36

కౌంటింగ్ వేళ.. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్

07 Nov, 11:33

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు.. కూటమి జోరు.. లేటెస్ట్ ట్రెండ్స్

07 Nov, 11:21

భలే పోటీ.. 60 రోజులు నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకుంది!

07 Nov, 11:13

బాల్ ట్యాంపరింగ్ కుట్ర.. ఆ ముగ్గురికే కాదు, జట్టు మొత్తానికీ తెలుసు: ఉస్మాన్ ఖవాజా

07 Nov, 10:52

ఓట్ల లెక్కింపునకు ముందే విషాదం.. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి దివ్య మృతి

07 Nov, 10:49

17 ఏళ్ల నిరీక్షణకు తెర.. కూకట్‌పల్లి ఫ్లాట్లపై సుప్రీం కీలక ఆదేశాలు

07 Nov, 10:48

ఇరాన్‌తో యుద్ధమే లేదు.. ఇజ్రాయెల్‌ను నేనే కాపాడాను: ట్రంప్

07 Nov, 10:45

ప్రముఖ వైద్యుడు దేవిశెట్టికి ఫ్రాన్స్ ప్రతిష్ఠాత్మక పురస్కారం

07 Nov, 10:43

ఆరోగ్యకరమైన దీపావళికి సిద్ధమవ్వండి.. ఈ ఒక్క రోజు ఇలా చేస్తే చాలు!

07 Nov, 10:15

హైదరాబాద్‌లో స్నేహం పేరుతో మోసం... కిలోల కొద్దీ బంగారం, వెండి చోరీ

07 Nov, 10:12

అనంతపురం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్

07 Nov, 10:11

ఫిట్‌నెస్ సాధించిన పంత్.. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు లైన్ క్లియర్

07 Nov, 10:09
..More Telugu News